iDreamPost

బ్యాంక్ ఆక్షన్‌లో కొత్త ఇల్లు కొంటారా? లక్షల్లో లాభం!

బ్యాంక్ ఆక్షన్‌లో  కొత్త ఇల్లు కొంటారా? లక్షల్లో లాభం!

సొంతింటి కల అనేది అందరికీ ఉంటుంది. కానీ దాన్ని నిజం చేసుకునే అదృష్టం కొందరికే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్లకి ఇల్లు కొనాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా గగనమే. ఇక హైదరాబాద్ లాంటి మహా నగరంలో అంటే కష్టమే. అదే డిస్కౌంట్ ఉందంటే ఇల్లు కొనాలని అనుకుంటారు కదా. ఓ పది లక్షలు తక్కువకి ఇల్లు వస్తుందంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. మీరు హైదరాబాద్ లో అది కూడా బంజారాహిల్స్ లో తక్కువ రేటుకి విశాలమైన ఫ్లాట్ కావాలని కోరుకుంటున్నట్లైతే మీ కోసమే ఈ అవకాశం. అవును బయట మార్కెట్ తో పోలిస్తే ఈ ఇల్లు ధరలు తక్కువగా ఉంటాయి. మేటర్ ఏంటంటే.. బ్యాంకులు ఇంటి డాక్యుమెంట్స్ మీద హౌస్ లోన్స్ ఇస్తుంటాయి. ఆ లోన్ చెల్లించలేని పరిస్థితుల్లో బ్యాంకులు ఆ ఇంటిని జప్తు చేస్తాయి. అలా జప్తు చేసిన వాటిని ఆక్షన్ లో పెడుతుంటాయి.

HDFC బ్యాంకు కూడా బంజారాహిల్స్ లోని ఓ ఫ్లాట్ ని ఆక్షన్ లో పెట్టింది. ఆ ఫ్లాట్ విస్తీర్ణం 1890 చదరపు అడుగులు. అంటే 210 గజాలన్న మాట. ఈ ఆక్షన్ కి రిజర్వ్ ధర రూ. 64 లక్షలుగా బ్యాంకు నిర్ధారించింది. ఒక చదరపు అడుగుకి రూ. 3,386గా నిర్ధారించింది. రిజర్వ్ ధర అంటే కనీస ధర. ఆ 210 గజాల ఫ్లాట్ కి బ్యాంకు వెలకట్టిన కనీస ధర. దీన్ని వేలంపాటలో బ్యాంకు పెడుతుంది. పాట పెంపు రూ. 30 వేలుగా నిర్ణయించింది. అంటే రూ. 64 లక్షలకి ఇంకో రూ. 30 వేలు యాడ్ అవ్వడంతో పాట మొదలవుతుంది. ఈ వేలంపాటలో పాల్గొనాలంటే ఈఎండీ అమౌంట్ అంటే ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ 6,40,000 కట్టాల్సి ఉంటుంది. ఇది రిఫండబుల్ అమౌంట్. వేలంపాట ధరలోని ఈఎండీ 10 శాతం ఉంటుంది. అక్టోబర్ 3వ తారీఖున అనగా మంగళవారం సాయంత్రం 4.30 గంటల లోపు ఈఎండీ సబ్మిట్ చేయాలి. అక్టోబర్ 6న అనగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకూ ఉంటుంది.

new home auction 2

ప్రస్తుతం బంజారాహిల్స్ లో ఫ్లాట్ కొనాలంటే చదరపు అడుగుకి కనీసం రూ. 8 వేలు పెట్టాలి. అంటే గజానికి రూ. 70 వేలు పైనే. ఇదే 210 గజాల ఫ్లాట్ కొనాలంటే ఇప్పుడున్న ధరల ప్రకారం కనీసం రూ. కోటి 50 లక్షలు అవుతుంది. అదే బ్యాంకు వేలంపాటలో అనుకోండి.. చదరపు అడుగుకి రూ. 3,386 పడుతుంది. అంటే గజం రూ. 30 వేలే. అయితే వేలంపాట కాబట్టి రేటు పెరుగుతుంది. అయితే ఆ ఏరియాలో ఉన్న ఫ్లాట్ రేట్ల కంటే ఎక్కువ ధర అయితే ఉండదు. 210 గజాల ఫ్లాట్ ఖరీదు రూ. కోటి 50 లక్షలు అయితే.. బ్యాంకు నిర్ణయించిన ధర రూ. 64 లక్షలు. వేలంపాటలో మహా అయితే రూ. 20 లక్షల నుంచి 30 లక్షలు పెరగొచ్చు. అలా చూసినా గానీ 210 గజాల ఫ్లాట్ కోటి రూపాయల్లో వస్తుంది. ఆపై రూ. 50 లక్షలు మిగిలినట్టే కదా.

బ్యాంకు వేలంపాటలో ఇళ్ళు, స్థలాలు, ఫ్లాట్లు కొంటే వచ్చే బెనిఫిట్స్ ఇవే. కొత్త ఇల్లు, తక్కువ ధరకి వస్తుంది. మరొక విషయం ఏంటంటే.. వేలంపాటలో తక్కువ ధరకి ఫ్లాట్ కొంటున్నాం కదా అని లిటిగేషన్ ఉంటుందేమో అన్న భయం అవసరం లేదు. ఎందుకంటే బ్యాంకులు కాబట్టి లీగల్ గా అన్నీ కరెక్ట్ గా ఫాలో అవుతాయి. అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉంటేనే కదా లోన్లు ఇచ్చేది. కాబట్టి ఈ విషయంలో నిశ్చింతగా ఉండచ్చు. ఈ ఒక్క బ్యాంకే కాదు.. ఇలా చాలా బ్యాంకులు చాలా ఇళ్లను, ఫ్లాట్లను ఆక్షన్ లో పెడుతుంటాయి. దాదాపు అన్నీ కొత్త ఇళ్ళు, కొత్త ఫ్లాట్లే ఉంటాయి. బయట మార్కెట్ కంటే తక్కువ ధరకే మీకు వస్తాయి కాబట్టి మీకు కనీసం 30 శాతం అయినా లాభం ఉంటుంది. కనీసం కాబట్టి తక్కువ ధరలో విశాలమైన ఫ్లాట్ సొంతం చేసుకోవాలనుకుంటే ఇదే మంచి అవకాశం.

  • దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • గమనిక: వేలంపాటలో పాల్గొనే ముందు, అలానే డబ్బు చెల్లించే ముందు ఫ్లాట్ ని తనిఖీ చేసుకోవాల్సిందిగా మనవి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి