iDreamPost

Credit Card Rules: క్రెడిట్ కార్డు యుజర్లకి అలెర్ట్.. ఏప్రిల్ నుంచి రూల్స్ మారుతున్నాయ్!

నేటికాలంలో క్రెడిట్ కార్డు వినియోగించే వారి సంఖ్య బాగా పెరిగింది. చాలా సందర్భాల్లో క్రెడిట్ కార్డునే వినియోగిస్తుంటారు. అలా ఈ కార్డును మీరు కూడ వినియోగిస్తున్నారా?. అయితే మీకే ఈ అలెర్ట్. ఎప్రిల్ నుంచి క్రెడిట్ కార్డు రూల్స్ మారబోతున్నాయి.

నేటికాలంలో క్రెడిట్ కార్డు వినియోగించే వారి సంఖ్య బాగా పెరిగింది. చాలా సందర్భాల్లో క్రెడిట్ కార్డునే వినియోగిస్తుంటారు. అలా ఈ కార్డును మీరు కూడ వినియోగిస్తున్నారా?. అయితే మీకే ఈ అలెర్ట్. ఎప్రిల్ నుంచి క్రెడిట్ కార్డు రూల్స్ మారబోతున్నాయి.

Credit Card Rules: క్రెడిట్ కార్డు యుజర్లకి అలెర్ట్.. ఏప్రిల్ నుంచి రూల్స్ మారుతున్నాయ్!

నేటికాలంలో  డబ్బులను వాడే విధానంలో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో  వినియోగదారులకు వివిధ రకాల  కార్డులు ఉంటాయి. క్రెడిట్, డెబిట్ వంటి పలు కార్డులు ఉంటాయి. అయితే చాలా మంది క్రెడిట్ కార్డును వినియోగిస్తున్నారు. ఈ కార్డును సరైన విధానంలో వినియోగిస్తే మంచిదేనని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. అలానే ఈ క్రెడిట్ వినియోగానికి పలు నిబంధనలు ఉంటాయి. ఇవి కూడా తరచూ మారుతు ఉంటాయి. తాజాగా క్రెడిట్ కార్డులో కొత్త రూల్స్ రాబోతున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

చాలా మంది క్రెడిట్ కార్డు వాడుతుంటారు. ఇదే సమయంలో క్రెడిట్ కార్డుకు సంబంధించిన రూల్స్ ను తెలుసుకుంటారు. క్రెడిట్ కార్డు వినియోగంలో ఇప్పటికే ఉన్న నిబంధనల గురించి అందరికి తెలిసే ఉంటుంది. అయితే త్వరలో రాబోయే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి క్రెడిట్ కార్డు వినియోగంపై కొత్త నిబంధనలు రానున్నాయి. ఈ రూల్స్ 2024 ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డు వినియోగంపై కొత్త రూల్స్ రాబోతున్నాయి. మరి.. ఆ కొత్త రూల్స్ కు సంబంధించిన వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రభుత్వరంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. తరచూ అనేక మార్పులు తీసుకొస్తు ఉంటుంది. తాజాగా క్రెడిట్ కార్డుల విషయంలో పలు కొత్త రూల్స్ ను ఎస్బీఐ తీసుకొచ్చింది. AURUM, ఎస్బీఐ కార్టు ఎలైట్, ఎస్బీఐ కార్టు ఎలైట్ అడ్వాంటేజ్, ఎస్బీఐ కార్టు పల్స్, సింప్లిక్లిక్ ఎస్బీఐ కార్డు వంటి ప్రముఖ క్రెడిట్ కార్డులలో కొన్నిటి కోసం అద్దె చెల్లింపులపై రివార్డు పాయింట్లు నిలిపివేయబడతాయి. ఇంకా రివార్డ్ పాయింట్ల వినియోగం 2024 ఏప్రిల్ 15తో ముగియనుంది.

New rules for credit card users

ఏప్రిల్ 1 నుంచి YES బ్యాంకు కూడ క్రెడిట్ కార్డు మార్పులు చేసింది. రూ. 10వేలు అంతకంటే ఎక్కువ ఖర్చు చేసే యస్ బ్యాంకు క్రెడిట్ కార్డులు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ కు  అర్హత  కలిగి ఉంటాయి.  ఈ నిబంధనల ఏప్రిల్ 1 వ తేదీ నుంచి అమలు కానుంది. అలానే ఐసీఐసీ బ్యాంకు కు సంబంధించి క్రెడిట్ కార్డుల్లో కూడా పలు మార్పులు జరగనున్నాయి. 2024 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి మారిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్ సైట్ పొందుపర్చిన వివరాల ప్రకారం.. గత త్రైమాసికంలో రూ.35వేలు ఖర్చు చేయడం ద్వారా ఒక కాంప్లిమెంటరీ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ ను పొందే వారు.

అంటే జనవరి,ఫిబ్రవరి,మార్చి 2024 త్రైమాసికంలో కనీసం 35వేల రూపాయలు ఖర్చు చేస్తే  తరువాత త్రైమాసికం అంటే ఏప్రిల్, మే, జూన్ 2024 త్రైమాసికంలో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ కు అర్హత కలిగి ఉంటారు. అలానే యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు కూడ ఏప్రిల్ 20 తేదీ నుంచి కొన్ని మార్పులు జరగనున్నట్లు సమాచారం. పెట్రోల్, ఇన్సూరెన్స్, గోల్డ్ పై ఖర్చు చేసే ఖర్చు కు ఎడ్జ్ రివార్డు పాయింట్లు ఉండవు. మొత్తంగా పలు బ్యాంక్ లు క్రెడిట్ కార్డుల్లో కీలక మార్పులు చేయనున్నాయి. ఈ కొత్త రూల్స్ కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలు కానున్నాయి. ఈ క్రెడిట్ కార్డు రూల్స్ విషయంపై పూర్తి సమాచారం కోసం సంబంధిత బ్యాంకుల్లో కనుక్కోవడం మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి