iDreamPost

Nepal: మరోసారి నేపాల్ రెచ్చగొట్టే చర్యలు.. ఈసారి ఏకంగా రూ.100నోటుపై..!

భారత్ తో నేపాల్ కు ఎన్నో ఏళ్ల స్నేహం ఉంది. అలానే  ఆ దేశానికి భారత్ ఎంతో సహయం చేసింది. భారత్ తో శతాబ్దాల అనుబంధాన్ని పక్కన బెట్టి..నేపాల్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది.

భారత్ తో నేపాల్ కు ఎన్నో ఏళ్ల స్నేహం ఉంది. అలానే  ఆ దేశానికి భారత్ ఎంతో సహయం చేసింది. భారత్ తో శతాబ్దాల అనుబంధాన్ని పక్కన బెట్టి..నేపాల్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది.

Nepal: మరోసారి నేపాల్ రెచ్చగొట్టే చర్యలు.. ఈసారి ఏకంగా రూ.100నోటుపై..!

కొందరికి తమ పక్కన ఉన్నవారు అభివృద్ధి చెందుతుండే చూడలేదు. కళ్లలో కారం పోసుకుంటారు. వారిపై ఉన్న అసుయాను వెల్లగక్కేందు అవకాశం ఎదురు చూస్తుంటారు. ఇక మరికొందరు అయితే అవకాశం దొరికి చాలు కయ్యానికికాలు దువ్వుతుంటారు. తాజాగా హిమాలయ రాజ్యం నేపాల్ ను చూస్తే.. అలానే అనిపిస్తోంది. భారత్ తో శతాబ్దాల అనుబంధాన్ని పక్కన బెట్టి..నేపాల్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. తాజాగా మరోసారి అలాంటి చర్యలకే దిగింది. మరి..  పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

భారత్ తో నేపాల్ కు ఎన్నో ఏళ్ల స్నేహం ఉంది. అలానే  ఆ దేశానికి భారత్ ఎంతో సహయం చేసింది. విపత్కర పరిస్థితుల సమయంలో కూడా నేపాల్ కి భారత్ అండగా ఉంది. అయితే ఇటీవల చైనా అండ చూసుకునే నేపాల్ భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ముఖ్యంగా సరిహద్దు భూభాగం విషయంలో నేపాల్ కొత్త రచ్చకు తెరలేపింది. భారత్ భూభాగాలతో నాలుగేళ్ల కిందట నేపాల్ కొత్త మ్యాప్‌ను రూపొందించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పట్లో నేపాల్ రూపొందించిన ఈ మ్యాప్  పై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. తాజాగా, తమ దేశ కరెన్సీ నోటుపై ఆ వివాదాస్పద మ్యాప్‌ను ముద్రించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేపాల్‌ కరెన్సీలోని 100 రూపాయల నోటుపై పాత మ్యాప్‌ స్థానంలో కొత్త మ్యాప్‌ను ముద్రించాలనే ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ అంశంపై ఆ దేశ ప్రధాని పుష్పకమాల్ దహల్ ప్రచండ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీర్మానించారు.

ఆ మ్యాప్ లో భారత్ లోని భూభాగాలను తమన భూభూగాలుగా పేర్కొంటూ నేపాల్ మ్యాప్ ను విడుదల చేసింది. అప్పట్లో ఆ పొలిటికల్ మ్యాప్ పై భారత్ తీవ్ర వ్యతిరేకను వ్యక్తం చేసింది. అయితే చైనా అండ చూసుకుని మరోసారి ఓవర్ యాక్షన్ చేస్తుంది. రూ.100 నోటుతో కొత్త వివాదానికి తెరతీసి భారత్‌తో గొడవ పెట్టుకునేందుకు ప్రయత్నిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్ల నుంచి పలు విషయాల్లో భారత్‌‌కు వ్యతిరేకంగా నేపాల్ వ్యవహరిస్తోంది. తాజా నిర్ణయంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నం చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీలను తమవే అంటూ నేపాల్ ..తమ కొత్త పొలిటికల్ మ్యాప్‌ రూపొందించింది.

నేపాల్ ప్రభుత్వ మంత్రిమండలి తీసుకున్న ఆ దేశ సమాచార, ప్రసార శాఖ మంత్రి రేఖా శర్మ వెల్లడించారు. ఏప్రిల్ 25, మే 2 తేదీల్లో జరిగిన సమావేశంలో కొత్త 100 రూపాయల నోటును రీడిజైన్‌కు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు. భారత్‌‌లోని సిక్కిం, వెస్ట్ బెంగాల్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో నేపాల్ 1,850 కి.మీ. సరిహద్దును పంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్, బీహార్ ప్రాంతాల్లోని పలు ప్రాంతాలను తమవే అంటూ ఇలాంటి నిర్ణయాలు తీసుకని వివాదస్పదం చేస్తుంది. మరి..నేపాల్ చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి