iDreamPost

9 నెలల చిన్నారి కిడ్నాప్.. మూడు రోజులుగా దొరకని ఆచూకి!

పైన కనిపిస్తున్న ఈ చిన్నారి కిడ్నాప్ కు గురైంది. గత మూడు రోజుల నుంచి ఈ పాప కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

పైన కనిపిస్తున్న ఈ చిన్నారి కిడ్నాప్ కు గురైంది. గత మూడు రోజుల నుంచి ఈ పాప కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

9 నెలల చిన్నారి కిడ్నాప్.. మూడు రోజులుగా దొరకని ఆచూకి!

గత కొంత కాలం నుంచి చిన్న పిల్లల కిడ్నాప్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కనిపించకుండా పోయిన చిన్నారులు చివరికి శవాలై కనిపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా చోట్ల వెలుగు చూశాయి. అయితే, ఈ వరుస మిస్సింగ్ ఘటనలు మరువక ముందే తాజాగా మరో 9 నెలల చిన్నారి కిడ్నాప్ కు గురైంది. ఉన్నట్టుండి ఆ పాప కనిపించకుండ పోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో అంతటా వెతికారు. కానీ, ఆ పాప ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ చిన్నారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లాలోని గుడ్లూరులో దేవరకొడ ఆనంద్-రజినీ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 16 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. కానీ, పెళ్లై ఎన్నేళ్లు గడిచినా.. ఈ భార్యాభర్తలకు పిల్లలు మాత్రం జన్మించలేదు. దీంతో ఈ దంపతులు గతంలో ఓ చిన్నారిని దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ పాపను వీళ్లు కన్న కూతురిలా చూసుకున్నారు. కట్ చేస్తే.. గత 9 నెలల కిందట ఈ దంపతులకు ఓ కూతురు జన్మించింది. పెళ్లైన పదహారేళ్లకు పాప పుట్టడంతో ఈ దంపతులు సంతోషంతో మురిసిపోయారు.

ఇక దత్తత తీసుకున్న పాప, వీరికి జన్మించిన కూతురిని ఈ భార్యాభర్తలు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. గత ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు వీరుంటున్న ఇంటికి వచ్చారు. మంచి నీళ్లు కావాలని అడిగారు. దీంతో రజినీ పాపను అక్కడే ఉంచి నీళ్ల కోసం ఇంట్లోకి వెళ్లింది. దీంతో ఆ దుండగులు ఆ 9 నెలల పసి పాపను కిడ్నాప్ చేశారు. ఇంట్లోకి వెళ్లిన రజినీ బయటకు వచ్చి చూడగానే కూతురు కనిపించలేదు. దీంతో కంగారుపడి రజినీ అంతటా వెతికింది. భర్తను నిద్రలేపి చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించారు. కానీ, ఆ చిన్నారి మాత్రం కనిపంచలేదు. ఇక ఉన్నట్టుండి ఆ పాప కనిపంచకపోవడంతో ఈ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు.

ఇక చేసేదేం లేక ఈ దంపతులు మరుసటి రోజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ 9 నెలల చిన్నారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి ఆ పాప ఆచూకి కోసం గాలిస్తున్నారు. మూడు రోజుల నుంచి ఈ చిన్నారి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి