iDreamPost
android-app
ios-app

నయనతార రేంజే వేరు! 50 సెకండ్ల యాడ్ కు అన్ని కోట్లా? స్టార్ హీరోలు కూడా సరిపోరు..

  • Published Mar 17, 2024 | 5:47 PM Updated Updated Mar 17, 2024 | 5:47 PM

ఓ యాడ్ లో నటించిన లేడీ సూపర్ స్టార్ నయనతార తీసుకున్న రెమ్యూనరేషన్ కు సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 50 సెకండ్ల యాడ్ కు నయన్ తీసుకున్న పారితోషికం ఎంతంటే?

ఓ యాడ్ లో నటించిన లేడీ సూపర్ స్టార్ నయనతార తీసుకున్న రెమ్యూనరేషన్ కు సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 50 సెకండ్ల యాడ్ కు నయన్ తీసుకున్న పారితోషికం ఎంతంటే?

  • Published Mar 17, 2024 | 5:47 PMUpdated Mar 17, 2024 | 5:47 PM
నయనతార రేంజే వేరు! 50 సెకండ్ల యాడ్ కు అన్ని కోట్లా? స్టార్ హీరోలు కూడా సరిపోరు..

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు పెద్దలు. ఈ సామెతను సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలబ్రిటీలు వందకు వంద శాతం ఫాలో అవుతూ ఉంటారు. అందుకే ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు యాడ్స్, బిజినెస్ లు అంటూ రెండు చేతులా సంపాదిస్తూ ఉంటారు. ఇక యాడ్స్ లో నటించేందుకు వారు తీసుకునే పారితోషికం చూస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే. తాజాగా ఓ యాడ్ లో నటించిన లేడీ సూపర్ స్టార్ నయనతార తీసుకున్న రెమ్యూనరేషన్ కు సంబంధించిన  న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 50 సెకండ్ల యాడ్ కు నయన్ తీసుకున్న పారితోషికం ఎంతంటే?

నయనతార.. లేడీ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ హీరోలకు సమానంగా స్టార్డమ్ ను అనుభవిస్తోంది నయన్. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే హీరోయిన్ గా నయన్ రికార్డుల్లోకి ఎక్కింది. అయితే నయన్ కు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. ఓ వైపు కమర్షియల్ మూవీలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీలతో అదరగొడుతోంది. ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ ఈ బ్యూటీ పెద్దగా యాడ్స్ చేయదు. దీనికి కారణం తెలియనప్పటికీ.. అప్పుడప్పుడు కొన్ని యాడ్స్ లో మెరుస్తుంటుంది ఈ అమ్మడు. తాజాగా ఓ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన నయన్ ఆ యాడ్ కు భారీగానే వసూల్ చేసిందట.

నయనతార లేటెస్ట్ గా టాటా స్కై ప్రమోషనల్ యాడ్ లో నటించినట్లు తెలుస్తోంది. కేవలం 50 సెకండ్ల ఈ యాడ్ కోసం నయన్ ఏకంగా రూ. 5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ న్యూస్ కాస్త వైరల్ కావడంతో.. స్టార్ హీరోలు కూడా ఇంత భారీ మెుత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోరుగా మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. నయన్ డిమాండ్ అలాంటిది మరి అని మరికొందరు రాసుకొస్తున్నారు. కాగా.. షారుఖ్ తో కలిసి జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈ అమ్మడు. ఈ మూవీ రూ. 1000 కోట్లు వసూల్ చేయడంతో.. బాలీవుడ్ లో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. మరి నయన్ కేవలం 50 సెకండ్ల యాడ్ కే ఇంత మెుత్తంలో పారితోషికం తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఈ చిన్నారి.. ఎందరో హృదయాలను గాయ పరిచిన హీరోయిన్.. గుర్తు పట్టారా..?

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişkingroyalgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom