Venkateswarlu
Venkateswarlu
సౌత్ ఇండియా లేడీ అమితాబ్ నయనతార దాదాపు 15 ఏళ్లుగా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. తమిళంలో ఎంతమంది కొత్త స్టార్ హీరోయిన్లు వచ్చినా.. నయన్ స్థానాన్ని మాత్రం కదిలించలేకపోతున్నారు. పెళ్లయి.. పిల్లలు పుట్టినా నెంబర్ వన్ రేసులోనే కొనసాగుతున్నారు. చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రస్తుతం ఆమె సినిమాలు చేస్తున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘జవాన్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా సెప్టెంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో నయనతారకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె షూటింగ్ స్పాట్లో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. నయనతార తమిళంలో జీవాతో కలిసి ‘తిరునాల్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో నయనతార బామ్మతో కలిసి బాత్రూములో ఇక్కట్లు పడే సీను ఉంటుంది. ఆ సీన్ షూటింగ్ జరుగుతున్నపుడు సినిమా సిబ్బంది ఒకరు డైలాగులు ప్రాంప్ట్ చెబుతూ ఉన్నారు.
నయనతార డైలాగులు చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉండగా.. వెనకాలనుంచి సిబ్బంది ఆమెకు డైలాగులు అందించసాగారు. అయితే, షాట్‌కు కట్ చెప్పిన తర్వాత నయనతార ‘‘ మీరు చెప్పకండి అని నేను చెప్పాను కదా.. నా డైలాగులు నేను చెప్పుకుంటా కదా.. మరి మీరెందుకు చెబుతున్నారు’’ అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావటం విశేషం. మరి, షూటింగ్ స్పాట్లో నయనతార సిబ్బందిపై మండిపడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.