iDreamPost
android-app
ios-app

ఏపీలో ఎక్కడా కనిపించని TDP బంద్ ఎఫెక్ట్! మద్దతు కరవు!

ఏపీలో ఎక్కడా కనిపించని TDP బంద్ ఎఫెక్ట్! మద్దతు కరవు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. శనివారం ఉదయం నంద్యాలో ఆయను అరెస్ట్ చేసింది మొదలు.. ఆదివారం రాత్రి 7 గంటలకు కోర్టు రిమాండ్ విధించే వరకు అందరిలో ఒకటే ఉత్కంఠ. 40 గంటల పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చంద్రబాబు కేసు ఏ మలుపు తిరుగుతుందా? అని ఆసక్తికరంగా ఎదురు చూశారు. ఇక ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ ను విధించింది. చంద్రబాబుకు రిమాండ్ కు నిరసనగా టీడీపీ, జనసేనతో సహాల పలు పార్టీలు బంద్ కి పిలుపు నిచ్చాయి. అయితే ఆ బంద్ ప్రభావం ఎక్కడా కనిపించలేదు.

ఆదివారం స్కిల్ డెవల్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. అంటే ఈనెల 22 వరకు చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. ఆయనను ఆదివారం అర్ధరాత్రి సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. అయితే చంద్రబాబుకు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ, జనసేనతో సహా పలు పార్టీలు సోమవారం బంద్ కు పిలుపునిచ్చాయి.

అయితే ఈ బంద్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఇరు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు దాదాపు ఈ బంద్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు టాక్. కొందరు కార్యకర్తలు మాత్రమే రోడెక్కి హడావిడి చేస్తున్నారు. ద్వితియ శ్రేణి నేతలు బంద్ కు  దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జనం కూడా బంద్ పిలుపును పెద్దగా పట్టించుకోలేదు. యధాతధంగా తమ పనుల్లో మునిగిపోగా.. ప్రజా రవాణ వ్యవస్థ సైతం ఎలాంటి అవాతంరాలు లేకుండా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రభావం కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సులు యధాతథంగా తిరుగుతున్నాయి. అయితే ముందస్తు జాగ్రత్తగా..ప్రధాన బస్ స్టేషన్ లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇక చంద్రబాబును తరలించిన రాజమండ్రి ప్రాంతంలో కూడా బంద్ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. రాజమండ్రిలో పొద్దు పొద్దునే దుకాణాలు షాపులు తెరుచుకున్నాయి.  అసలు చంద్రబాబును అరెస్ట్ చేస్తే..మాకెంటీ సంబంధం అన్నట్లు ప్రజల తీరు కనిపిస్తుంది. ఉదయం నుంచే వ్యాపార సముదాయాలు, మార్కెట్లు యధావిధిగా  తెరచుకున్నాయి. కొందరు టీడీపీ కార్యకర్తలు జెండాలతో హడావుడి చేస్తున్నా.. జనాలు అవేమి పట్టించుకోకుండా తమ పనులు తాము చేసుకుంటున్నారు.

ఇది ఇలా ఉంటే.. చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు  విధ్వంసానికి తెగబడే అవకాశాల ఉంటాయనే సమాచారంతో.. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అలానే అల్లర్లు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ర్యాలీలు, సభలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇలా టీడీపీ బంద్ కు మద్దతు కరువు అవ్వడంతో ఆ పార్టీ నేతలు అయోమయంలో పడిపోయారు. మరి..  టీడీపీ తలపెట్టిన బంద్ విఫలం అంటు వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.