iDreamPost

చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వూలు జారీ చేసింది.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వూలు జారీ చేసింది.

చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తరువాత మధ్యతర బెయిల్ పై బయటకు వచ్చారు. ఇటీవలే హైకోర్టు ఆ కేసుకు సంబంధించి ప్రధాన బెయిల్ కూడా బాబుకు మంజూరు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీఐడీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మంగళవారం విచారణ జరగ్గా.. చంద్రబాబుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. చంద్రబాబుకు బెయిల్ షరతులను సుప్రీం కోర్టు విధించింది.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో  నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీం కోర్టుకు వెళ్లింది. సుప్రీం కోర్టులో చంద్రబాబుకు  బెయిల్ రద్దు చేయాలని ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం కోర్టులో సీఐడీ వేసింది. ఈ పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చింది.

ఇరువైపు వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక ఉత్తర్వూలు జారీ చేసింది.  ఈ కేసును డిసెంబర్ 8వ తేదీకీ విచారణ వాయిదా వేసినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో బెయిల్  షరతులన్ని యథాతధంగా ఉంటాయని పేర్కొంది. కేసు వివరాలపై బహిరంగంగా ప్రకటనలు చేయోద్దని చంద్రబాబును హెచ్చరించింది. ర్యాలీలు నిర్వహించడం, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని పేర్కొంది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను పరిశిలీస్తే.. చంద్రబాబు కేసులన్నీ సెక్షన్ 17ఏ తో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ కేసులో చంద్రబాబు అరెస్టు కాగానే ఆయన తరపు లాయర్లు సెక్షన్ 17ఏ రాగం అందుకున్నారు. చంద్రబాబు తప్పు చేయలేదనే అంశం పక్కన పెట్టి.. అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలంటూ మెలిక పెట్టారు. నేరం జరిగింద, విచారణ మొదలైంది.. ఆ సెక్షన్ అమల్లోకి రాకముందే అని చెప్పినా వినిపించుకోకుండా.. హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ చంద్రబాబు లాయర్లు ఇవే వాదనలు వినిపించారు. మొత్తం మీద ఈ కేసులో కీలకమైన సెక్షన్ 17ఏ, దాని చుట్టూ ఇరుపక్షాలు చేస్తున్న వాదనలను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అవకాశం ఉందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి