Uppula Naresh
Uppula Naresh
పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ మహిళ పేరు పుష్పలత. ఆమె తల్లిదండ్రులు కొంత వరకు చదివించారు. ఇక పెళ్లి వయసు రావడంతో ఆమెకు కుటుంబ సభ్యులు ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తలు ఎలాంటి గొడలు, మనస్పర్థలు లేకుండా సంతోషంగా జీవించారు. కొన్నాళ్లకి వీరికి ఓ కూతురు, కుమారుడు జన్మించారు. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే గతంలో ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని ఈ మహిళ.. పిల్లలను చూసుకుంటూ బతికింది. ఈ క్రమంలోనే మరో విషాదం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ పట్టణంలో సింగం-పుష్పలత దంపతులు నివాసం ఉండేవారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకి వీరికి ఓ కూతురు, కుమారుడు జన్మించారు. అయితే, భర్త ఓ సంస్థలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. అలా చాలా కాలం పాటు ఈ భార్యాభర్తలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా కాపురాన్ని కొనసాగించారు. ఈ తరుణంలోనే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలిసిన వాళ్లను చాలామందిని అప్పు అడిగారు. ఎవరూ కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇక ఆ సమయంలో సింగంకు ఎలాంటి మార్గం కనిపించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
భర్త మరణాన్ని జీర్ణించుకోలేక మృతుడి భార్య పుష్పలత గుండెలు పగిలేల ఏడ్చింది. ఇక కొన్నాళ్లకి భర్త పని చేసిన సంస్థలోనే అధికారులు పుష్పలతకు ఓ ఉద్యోగాన్ని కల్పించారు. అప్పటి నుంచి ఈ మహిళ అక్కడే పని చేస్తూ కుటుంబాన్ని పోషించింది. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి పుష్పలత కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమెకు కూడా ఏం చేయాలో అస్సలు తోచలేదు. దీంతో చేసేదేం లేక పుష్పలత ఇటీవల ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు భర్త, ఇప్పుడు భార్య బలవన్మరణానికి పాల్పడడంతో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.