iDreamPost
android-app
ios-app

ఇంతకంటే దారుణం ఉంటుందా? మద్యానికి బానిసై కొడుకును అమ్మేసిన తండ్రి!

ఇంతకంటే దారుణం ఉంటుందా? మద్యానికి బానిసై కొడుకును అమ్మేసిన తండ్రి!

ఈ రోజుల్లో మద్యం తాగడం అనేది ట్రెండ్ గా మారింది. ఇంటర్ పోరగాళ్ల నుంచి వృద్ధుల వరకు అందరూ మద్యానికి అలవాటు పడ్డారు. ఫ్రెండ్స్ కలిసినప్పుడో, ఫంక్షన్స్ జరిగినప్పుడో తాగుతున్నారంటే అదీ లేదు. సమయం సందర్భం లేకుండా రోజూ అదే పనిగా తాగి బానిసైన వాళ్లు కోకల్లుగా ఉన్నారు. అచ్చం ఇలాగే మద్యానికి బానిసైన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తాగడానికి డబ్బులు లేవని ఏకంగా కన్న కొడుకునే అమ్మేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ తర్వాత ఏ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పోలీసుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లాలోని పదరలో నల్లబోతుల మల్లయ్య-ముత్యాలమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు జన్మించింది. ఇదిలా ఉంటే.. గత నాలులు నెలల కిందటే మరో కుమారుడు జన్మించాడు. అయితే.. మల్లయ్య మద్యానికి బానిసై రోజూ పీకల దాక తాగి ఇంటికి వస్తున్నాడు. భార్య ఎంత చెప్పినా వినకుండా అదే పనిగా తాగుతూ ఉండేవాడు. ఇక ఇటీవల మల్లయ్యకు మద్యం తాగడానికి డబ్బులు లేకపోవడంతో అతనికి ఏం చేయాలో తోచలేదు. ఆ సమయంలోనే మల్లయ్యకు ఓ ఆలచన పుట్టుకొచ్చింది. అదేంటంటే.. తన నాలుగు నెలల కొడుకును అమ్మడం. వినటానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. మల్లయ్య అనుకున్నదే ఆలస్యం.. ఇటీవల తన కొడుకును తీసుకుని ఆమ్రాబాద్ లో ఓ వ్యక్తికి అమ్మేశాడు.

అదే రోజు అతడు తిరిగి ఇంటికి రాగానే భార్య భర్తను కొడుకు ఎక్కడ అని ప్రశ్నించింది. దీంతో మల్లయ్య తాగిన మత్తులో ఉండి ఏం చెప్పాలో తెలియక నోట్లో నీళ్లు నమిలాడు. ఇక ఇదే విషయమై గ్రామస్తులు ఏకమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మల్లయ్యను ప్రశ్నించగా ఆమ్రాబాద్ లో ఓ వ్యక్తికి అమ్మేశానని నిజాన్ని బయటపెట్టాడు. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు ఎట్టకేలకు ఆ నాలుగు నెలల చిన్నారిని ఆమన్ గల్ లో అదుపులోకి తీసుకుని మహబూబ్ నగర్ లోని శిశు గృహకు తరలించారు. దీంతో ఆ చిన్నారి తల్లి ముత్యాలమ్మ ఊపిరి పీల్చుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. మద్యానికి డబ్బులు లేక కుమారుడిని అమ్మేసిన ఇతగాడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: ప్రియుడిని పాముతో కాటువేయించి చంపిన ప్రియురాలు! తర్వాత కొత్త ప్రియుడితో..

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet