iDreamPost

ప్రియుడిని పాముతో కాటువేయించి చంపిన ప్రియురాలు! తర్వాత కొత్త ప్రియుడితో..

  • Author Soma Sekhar Published - 11:49 AM, Thu - 20 July 23
  • Author Soma Sekhar Published - 11:49 AM, Thu - 20 July 23
ప్రియుడిని పాముతో కాటువేయించి చంపిన ప్రియురాలు! తర్వాత కొత్త ప్రియుడితో..

నేటి సమాజంలో మనుషులకు వచ్చే ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే.. వాటిని చూస్తే మనం ముక్కున వేలేసుకోవాల్సిందే. అయితే ఇలాంటి ఉపాయాలు బాగుపడదానికంటే.. చెడిపోవడానికే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కొందరు. ఇలాంటి వారు పక్కా స్కెచ్ తో కొందరిని వదిలించుకోవాలని చూస్తుంటారు. కానీ పోలీసుల ముందు వారి ఆటలు సాగక.. కటకటాలపాలవుతుంటారు. తాజాగా ఓ యువతి తన పాత ప్రియుడిని వదిలించుకోవడానికి ఖతర్నాక్ స్కెచ్ వేసింది. పాముతో కాటువేయించి పాత ప్రియుడిని చంపి.. కొత్త ప్రియుడితో పరార్ అయ్యింది ఓ ఖతర్నాక్ యువతి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ప్రియుడు ఫుల్ గా తాగొచ్చి.. తన ఫ్రెండ్స్ ముందు నోటికొచ్చినట్లు తిట్టాడని పగపెంచుకుంది ప్రియురాలు. అనుమానం రాకుండా ప్రియుడిని పాముతో కాటువేయించి మరీ చంపించింది ఆ యువతి. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ లోని రాంపూర్ రోడ్డులోని రాంబాగ్ ప్రాంతానికి చెందిన అంకిత్ చౌహాన్(32) ఓ బిజినెస్ మెన్. ఇతడికి మహి ఆర్య అనే యువతితో సంబంధం ఉంది. ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారు. కాగా.. ఓ రోజు అంకిత్ చౌహాన్ తప్పతాగి వచ్చి మహి ఆర్యను తన ఫ్రెండ్స్ ముందు ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. అప్పటి నుంచి ఆమె అంకిత్ పై కోపాన్ని పెంచుకుంది.

అయితే గత కొన్ని రోజులుగా ఆర్యకు దీప్ కందపాల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. తాగి వచ్చి తిట్టే పాత ప్రియుడిని వదిలించుకోవాలని ప్లాన్ వేసింది. అందులో భాగంగానే రమేశ్ నాథ్ అనే పాములు పట్టే వ్యక్తికి రూ. 10 వేలు ఇచ్చి.. అతడి పాముతో అంకిత్ చౌహాన్ ను కాటువేయించి చంపింది మహి ఆర్య. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు అంకిత్ శవాన్ని కారులో తీసుకెళ్లి రైల్వే గేట్ సమీపంలో ఉంచింది. కాగా.. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు జులై 15న అంకిత్ శవాన్ని కారులో గుర్తించారు. పోలీసులు వచ్చే సరికి కారు ఇంజిన్ రన్నింగ్ లో ఉంది. దాంతో ఏసీ నుంచి విడుదలైన కార్బన్ మోనాక్సైడ్ లోపల కమ్మేసింది. దీని కారణంగానే అంకిత్ చనిపోయి ఉంటాడని తొలుత పోలీసులు భావించారు.

అయితే అతడు చనిపోయిన తీరు అనుమానాస్పదంగా ఉండటంతో.. పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టానికి పంపించారు. దాంతో అతడు కార్బన్ మోనాక్సైడ్ వల్ల చనిపోలేదని, పాము కాటుతో చనిపోయాడని రిపోర్టులో తెలిసింది. అంకిత్ శరీరంపై రెండు చోట్ల పాము కాట్లు కనిపించాయి. దాంతో అతడి సోదరి ఈశా.. తన సోదరుడి చావుకు ఆర్య, దీప్ కందపాల్ అనే ఇద్దరు వ్యక్తులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాల్ డేటా ఆధారంగా పాములు పట్టే వ్యక్తి రమేశ్ నాథ్ ను విచారించగా.. అన్ని విషయాలు పూసగుచ్చినట్లు అతడు చెప్పుకొచ్చాడు. కొత్త ప్రియుడితో పారిపోవడానికే పాత ప్రియుడు అంకిత్ ను చంపిందని అతడు విచారణలో తెలిపాడు. కాగా.. కొత్త ప్రియుడు, ఫ్రెండ్స్ తో కలిసి మహి ఆర్య నేపాల్ పారిపోయినట్లు రమేశ్ నాథ్ చెప్పాడు. దాంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి, వారిని పట్టుకోవడానికి రెండు బృందాలను నేపాల్ కు పంపించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి