Krishna Kowshik
మాలీవుడ్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్. వాళ్ల కథలు కానీ, కంటెంట్ కానీ చాలా డిఫరెంట్. చిన్న లైన్ తీసుకుని సినిమా తెరకెక్కించడం, హిట్ కొట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి మూవీనే ..
మాలీవుడ్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్. వాళ్ల కథలు కానీ, కంటెంట్ కానీ చాలా డిఫరెంట్. చిన్న లైన్ తీసుకుని సినిమా తెరకెక్కించడం, హిట్ కొట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి మూవీనే ..
Krishna Kowshik
మాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లంతా ఏదో ప్రత్యేకంగా తింటున్నారబ్బా.. లేకపోతే ఆ సినిమాలేంటీ, ఆ క్రియేటివిటీకి ఏంటీ.. మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఎక్కడ నుండి పుట్టుకు వస్తాయిరా బాబూ ఈ కథలు, ఈ ఆలోచనలు అనిపించకమానవు. కోట్లు కుమ్మరించరు. లోకేషన్లు అంటూ ఫారెన్స్ ట్రిప్పులు వేయరు.హీరో, హీరోయిన్లకు కాస్ట్యూమ్స్‌కు పెద్ద ఖర్చు పెట్టరు. ఇట్లా సినిమాలు తీసి అలా విడుదల చేస్తూ..హిట్ కొట్టడమే కాకుండా.. మరో ఇండస్ట్రీలో ఆ మూవీ రీమేక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంటారు. అలా అని నిర్మాణ విలువలు బాగోవా అంటూ.. సింప్లీ సూపర్బ్. క్రైమ్, హారర్, థ్రిల్లర్ జోనర్ మూవీస్సే కాదూ.. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ అందించగలమని నిరూపిస్తున్నారు దర్శక నిర్మాతలు.
అలాంటి ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైన్‌మెంట్ మూవీనే బ్రో డాడీ. మాలీవుడ్ టాప్ హీరోస్ మోహన్ లాల్, పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోలు. మోహన్ లాల్ అల్రెడీ తెలుగు వారికి వెల్ నెటెడ్ అయ్యాడు. అలాగే పృధ్వీ కూడా సలార్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ఒకప్పటి స్టార్ నటి మీనా, కళ్యాణి ప్రియదర్శిని,కనిక హీరోయిన్లుగా నటించారు. ఆశీర్వాద్ సినిమాస్ పై ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు. ఈ చిత్రానికి పృధ్వీనే డైరెక్టర్ కావడం విశేషం. లూసిఫర్ తర్వాత పృధ్వీ డైరెక్ట్ చేసిన రెండవ మూవీ ఇది. ఇందులో మరో విశేషమేమిటంటే.. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో స్టార్ అయ్యింది. కరోనా సెకండ్ వేవ్‌లో కేవలం 45 రోజుల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా.. నేరుగా ఓటీటీలోనే విడుదలయ్యింది.
జనవరి 26న 2022లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదలై.. మంచి రివ్యూస్ రాబట్టుకుంది. చిన్న లైన్ తీసుకుని సినిమా అంతా తెరకెక్కించిన విధానం బాగుంటుంది. ఇది ఫక్తు కుటుంబ కథా చిత్రం. ఇక కథలోకి వెళితే.. జాన్ కట్టాడి (మోహన్ లాల్), అన్నమ్మ (మీనా) భార్యా భర్తలు. అతడు తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన టిఎంటీ స్టీల్ బార్ వ్యాపారాన్ని నడుపుతూ ఉంటాడు. వీరికి ఒక్కగానొక్క కొడుకు ఈషో కట్టాడి (పృధ్వీ రాజ్ సుకుమారన్). బెంగళూరులోని ప్రముఖ అడ్వరైజింగ్ కంపెనీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పనిచేస్తుంటారు. అలాగే జాన్ చిన్ననాటి నుండి స్నేహితుడు, కురియన్ మలియక్కల్, అతడి భార్య ఎల్సీ (కనిక).. అన్నా (కళ్యాణీ ప్రియదర్శన్) కూతురు ఉంటుంది. ఆమె కూడా బెంగళూరులో ఐటి ఉద్యోగం చేస్తూ ఉంటుంది.
అయితే అన్నమ్మను కురియన్ కూడా ప్రేమిస్తాడు. కానీ ఆమె పేరెంట్స్ నిరాకరిస్తారు. దీంతో ఆమెపై ఉన్న ప్రేమతోనే కూతురికి అన్నా అనే పేరు పెడతాడు. అయితే ఈ ఇద్దరి మధ్య సంబంధాలు బాగుంటాయి. ఈషో, అన్నాకు పెళ్లి చేయాలన్న యోచనలో ఉంటారు కుటుంబ సభ్యులు. అయితే అతడిని పెళ్లి చేసుకోనని చెబుతుంది అన్నా. కానీ ఇక్కడే మేటర్ రివీల్ అవుతుంది. అన్నా, ఈషో నాలుగేళ్లుగా పెద్దలకు తెలియకుండా బెంగళూరులో కాపురం పెట్టేస్తారు. ఇద్దరు లివింగ్ టుగెదర్‌లో ఉంటారు. ఇంట్లో చెబుదాము అనుకునే లోపు .. కళ్యాణి ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ ట్విస్ట్ అనుకునే లోపు.. తండ్రి ఇంటికి రావాలంటూ ఫోన్ చేయగానే.. అక్కడికి వెళ్లగా మరో ట్విస్ట్ రివీల్ అవుతుంది. తల్లి కూడా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది.
తాత కావాల్సిన వయస్సులో తండ్రి అవుతుంటే.. సిగ్గు పడిపోతుంది మోహన్ లాల్, మీనాల జంట. అదే సమయంలో కొడుకు కూడా తండ్రి కాబోతున్నట్లు మోహన్ లాల్ కు తెలిసిపోతుంది. అక్కడ నుండి కథ ఫన్నీగా సాగిపోతుంది. కూతురు పెళ్లి కాకుండా తల్లి అయ్యిందని కురియన్ దంపతులకు ఎలా తెలిసింది.. ఆ తర్వాత ఏమైంది అన్నది మిగిలిన స్టోరీ. మిగతా స్టోరీ చూడాలంటే.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది.. ఈ మూవీని తెలుగులో కూడా తెరకెక్కించాలని ప్లాన్ జరిగింది. మరీ ఎక్కడో వర్కౌట్ కాలేదు. వెయిట్ చేద్దాం. ఈ వీకెంట్ లో ఏదైనా ఫన్నీ సినిమా చూడాలంటే.. ఈ చిత్రాన్ని వీక్షించండి. ఈ మూవీ ఎలా ఉందో చూసి.. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.