Arjun Suravaram
Arjun Suravaram
తమ అభిమాన నేతలపై కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఏదో ఒక రూపంలో అభిమానం చాటుకుంటారు. ఆయన కోసం రేయింబవళ్లు ప్రచారం పాల్గొనడం, ఇతర కార్యక్రమాలు చేయడం వంటివి చేస్తుంటారు. ఇంకా తమ నేత కోసం డబ్బులను ఖర్చు చేస్తుంటారు. ఇలా కేవలం కొందరు మనుషులే కాకుండా.. గ్రామాలకు, గ్రామాలకు తమ నేత ఎన్నికల నామిషన్ల ఖర్చులకు విరాళాలు వేసుకుంటారు. తాజాగా 100 వృద్ధులు లక్ష విరాళంగా ఇచ్చారు. అది కూడా ఎవరికో కాదు.. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ఎన్నికల నామినేషన్లకు పెన్షన్ డబ్బులను వివరాళంగా ఇచ్చారు. మరి.. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై తమకున్న ప్రేమను ముఖరా(కే) గ్రామస్థులు చాటుకున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల నామినేషన్ల కోసం ముఖరా(కే) గ్రామస్తులు తమ పెన్షన్ డబ్బులను విరాళంగా ఇచ్చారు. గ్రామంలోని పెన్షన్‌దారులందరూ రూ.1000 చొప్పున రూ. 1 లక్ష వరకు సేకరించి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ విరాళాన్ని 100 మంది పెన్షన్‌దారులు ఇచ్చారు. అంతేకాక కేసీఆర్, కేటీఆర్ లు చేసిన సాయం, అందిస్తున్న పథకాలపై వృద్ధులు ప్రశంసించారు. తండ్రీకొడుకుల వలనే బంగారు తెలంగాణ సాకారం అవుతోందిని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పెన్షన్ దారులు విరాళం ఇచ్చేందుకు ఓ బాక్స్ ను ఏర్పాటు చేసుకున్నారు.
100 పెన్షన్ దారులు ఒక్కొక్కరు రూ.1000 చొప్పున విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమకు కేసీఆర్ పింఛనే ఆసరా అని అన్నారు. తమకు పెద్ద కొడుకులా కేసీఆర్ ప్రతి నెల సమయానికి పింఛన్ ఇచ్చి.. బ్రతుకుకు భరోసాగా నిలుస్తుండని సంతోషం వ్యక్తం చేశారు. తమకు ఇంతలా సాయం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్ నామినేషన్ కోసం రూ.1000 చొప్పున విరాళం ఇస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన ట్వీట్‌ను కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. ఆ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ట్వీట్‌ను కేటీఆర్ తన పేజీలో షేర్ చేస్తూ.. థాంక్యూ, రియల్లీ టచ్‌డ్ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ముఖరా(కే) గ్రామస్థులు చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🙏 Thank You. Really touched ❤️ https://t.co/CF2zn9otXB
— KTR (@KTRBRS) August 28, 2023
ఇదీ చదవండి: ఉద్యోగులకు KCR సర్కార్ మరో శుభవార్త.. వారికి ఏకంగా 30 శాతం పీఆర్సీ