iDreamPost

ఉద్యోగులకు KCR సర్కార్‌ మరో శుభవార్త.. వారికి ఏకంగా 30 శాతం పీఆర్సీ

  • Published Aug 29, 2023 | 8:17 AMUpdated Aug 29, 2023 | 8:17 AM
  • Published Aug 29, 2023 | 8:17 AMUpdated Aug 29, 2023 | 8:17 AM
ఉద్యోగులకు KCR సర్కార్‌ మరో శుభవార్త.. వారికి ఏకంగా 30 శాతం పీఆర్సీ

తెలంగాణలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దాంతో కేసీఆర్‌ ప్రభుత్వం.. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలపై వరాల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కేసీఆర్‌ సర్కార్‌ సాంస్కృతిక సారథిలోని(టీఎస్‌ఎస్‌) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారికి ఏకంగా 30 శాతం పీఆర్సీ అమలు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్‌ఎస్‌ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థిక శాఖ 3 నెలల క్రితమే ఆమోదం తెలిపింది. తాజాగా దీనికి కేసీఆర్‌ ఆమోదముద్ర వేయడంతో.. ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక పెరగనున్న పీఆర్సీ.. 2021, జూన్‌, 1వ తేదీ నుంచి వర్తించనుంది.

ప్రస్తుతం తెలంగాణ సాంస్కృతిక సారధిలో మొత్తం 583 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరికి.. ప్రస్తుత పే స్కేలు మీద 30 శాతం పీఆర్సీని అమలు చేస్తూ.. కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సాంస్కృతిక సారధిలో విధులు నిర్వహిస్తోన్న ఉద్యోగుల పేస్కేలు రూ. 24,514 ఉండగా.. తాజాగా అమల్లోకి రానున్న పీఆర్సీ ప్రకారం ఒక్కొక్కరి జీతం దాదాపు 7,300 మేర పెరగనుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్తున్నారు.

ఇక కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు కేసీఆర్ సర్కారు గుడ్‌ న్యూస్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును పెంచుతూ.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వాళ్ల రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలుగా ఉండగా.. దాన్ని 65 ఏళ్లకు పెంచుతూ కేసీఆర్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక.. పదవీ విరమణ చేసిన అంగ‌న్‌వాడీ టీచర్లకు రూ.ల‌క్ష, మినీ అంగ‌న్‌వాడీ టీచ‌ర్లతో పాటు హెల్పర్లకు రూ. 50 వేల ఆర్థిక సాయం కూడా అందించనున్నట్టు ప్రకటించింది. ఇప్పుడేమో సాంస్కృతిక సారధిలో పని చేస్తోన్న వారికి పీఆర్సీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి