iDreamPost

Ayodhya Ram Mandir: అయోధ్యకు అంబానీ ఫ్యామిలీ ఇచ్చిన విరాళం ఎన్ని కోట్లంటే?

అయోధ్య రామయ్యను ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ కుటుంబం దర్శించుకుంది. ఆ రామయ్యకు అంబానీ కుటుంబం భారీ విరాళం కూడా ప్రకటించింది.

అయోధ్య రామయ్యను ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ కుటుంబం దర్శించుకుంది. ఆ రామయ్యకు అంబానీ కుటుంబం భారీ విరాళం కూడా ప్రకటించింది.

Ayodhya Ram Mandir: అయోధ్యకు అంబానీ ఫ్యామిలీ ఇచ్చిన విరాళం ఎన్ని కోట్లంటే?

కొన్ని కోట్ల మంది కల అయోధ్య వేదికగా నెరవేరింది. అయోధ్య రామమందిరంలో ఆ శ్రీరాముడు బాలరాముడి ఆకృతిలో కొలువుదీరాడు. ఆ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు కుటుంబాలు తరలి వెళ్లాయి. వారిలో అంబానీ కుటుంబం కూడా ఒకటి. దేశ, విదేశాల నుంచి కూడా అతిరథ మహారథులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అయోధ్యకు చేరుకున్నారు. అంబానీ కుటుంబం ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా.. భారీ విరాళం కూడా అందజేసింది.

అయోధ్యలో శ్రీరామ మూర్తి ప్రాణ ప్రతిష్టకు సినీ, రాజకీయ ప్రముఖల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు వరకు వేలాది సంఖ్యలో చేరుకున్నారు. అందరూ ఆ రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూసి పులకించిపోయారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుటుంబం కూడా అయోధ్యలో సందడి చేసింది. భార్యాపిల్లలు, కోడళ్లు, అల్లుడు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్యకు చేరుకున్న అతి కొద్దిసేపటికే అంబానీ కుటుంబం ఈ విరాళాన్ని ప్రకటించాయి. అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులను కలిసి ముఖేశ్ అంబానీ విరాళాన్ని అందజేశారు.

Ambani family's huge donation to Ayodhya Ramaiah

అయోధ్య రామ మందిరానికి ఆయన 2.51 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. అందుకు సంబంధించిన చెక్కును ట్రస్టు సభ్యులకు ముఖేశ్ అంబానీ అందజేశారు. అనంతరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరవ్వడంపై ముఖేశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేశంలో ఎక్కడ చూసినా జైశ్రీరామ్ నినాదాలే వినిపిస్తున్నాయి. ఇవాళే శ్రీరాముడు వచ్చాడు. దేశంలో జనవరి 22 రామ్ దీపావళి అవుతుంది. చరిత్రలో ఈ రోజు కచ్చితంగా నిలిచిపోతుంది” అంటూ వ్యాఖ్యానించారు. ముఖేశ్ అంబానీ దేవాలయాలకు భారీ విరాళాలు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్ 2023లో బద్రీనాథ్- కేదార్ నాథ్ ఆలయ కమిటీకి రూ.5 కోట్లు విరాళంగా అందజేశారు. గుజరాత్ సోమనాథ్ ఆలయానికి 1.51 కోట్లు అందజేశారు.

అయోధ్య రాములవారికి బహుమతులు, విరాళాల రూపంలో వేలకోట్లు వచ్చాయని ట్రస్టు సభ్యులు ఇప్పటికే వెల్లడించారు. వాటన్నంటిలో అత్యధికంగా సూరత్ కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ అత్యధికంగా 101 కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఆ తర్వతా మొరారీ బాపు శిష్యులు అంతా కలిసి సేకరించిన రూ.16.2 కోట్ల విరాళం అత్యధికంగా ఉంది. ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు కూడా రూ.11.3 కోట్లు విరాళంగా అందజేశారు. ఆ తర్వాత సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి రూ.11 కోట్లు విరాళంగా అందజేసిన విషయం తిలిసిందే. మరి.. అయోధ్యకు అంబానీ రూ.2.51 కోట్లు విరాళంగా అందజేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి