iDreamPost

CSK vs GT: ధోని సూపర్‌ క్యాచ్‌! కానీ.. ఇందులో ఓ ద్రోహం ఉంది!

  • Published Mar 27, 2024 | 2:23 PMUpdated Mar 27, 2024 | 2:23 PM

MS Dhoni, CSK vs GT, IPL 2024: గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ క్యాచ్‌ అందుకున్న ధోనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతను ద్రోహం చేశాడంటూ కొంతమంది మండిపడుతున్నారు. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం..

MS Dhoni, CSK vs GT, IPL 2024: గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ క్యాచ్‌ అందుకున్న ధోనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతను ద్రోహం చేశాడంటూ కొంతమంది మండిపడుతున్నారు. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 27, 2024 | 2:23 PMUpdated Mar 27, 2024 | 2:23 PM
CSK vs GT: ధోని సూపర్‌ క్యాచ్‌! కానీ.. ఇందులో ఓ ద్రోహం ఉంది!

ఐపీఎల్‌ 2024లో ఒక్క క్యాచ్‌తో ధోని సత్తా ఏంటో క్రికెట్‌ ప్రపంచానికి మరోసారి తెలిసొచ్చింది. మంగళవారం చెన్నైలోని చిదంబరం క్రికెట్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని ఒక అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో.. సీఎస్‌కే బౌలర్‌ డారిల్‌ మిచెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ మూడో బాల్‌కు టైటాన్స్‌ బ్యాటర్‌ విజయ్‌ శంకర్‌ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ, అది ఎడ్జ్‌ తీసుకొని.. వికెట్‌ కీపర్‌ ధోనికి కుడివైపు చాలా దూరంగా వెళ్లింది. ఆ బాల్‌ను గాల్లోకి అమాంతం దూకి.. సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు ధోని. ఈ క్యాచ్‌ చూసిన క్రికెట్‌ ఫ్యాన్ష్‌ షాక్‌ అవుతున్నారు. ధోని ఇంకా ఇంత ఫిట్‌గా ఉన్నాడా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే ధోని ఫ్యాన్స్‌ తమ ఆరాధ్య క్రికెటర్‌పై కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. తమకు ధోని ద్రోహం చేస్తున్నాడంటూ మండిపడుతున్నారు. అది ఎందుకో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

టీమిండియా కెప్టెన్‌గా ధోని మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌. భారత్‌కు 2007లో టీ20 వరల్డ్‌ కప్‌, 2011లో వన్డే వరల్డ్‌ కప్‌, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ అందించిన కెప్టెన్‌గా ధోనికి ఘన చరిత్ర ఉంది. కెప్టెన్‌గా, ఆటగాడిగా ఎంతో అద్భుతాలు చేసిన ధోని.. 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆ తర్వాత కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్‌ 2021, 2022, 2023తో పాటు ఇప్పుడు 2024 సీజన్‌లో కూడా ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయి.. నాలుగేళ్లు పూర్తి అయినా, ఐపీఎల్‌ తప్ప మధ్యలో క్రికెట్‌ ఆడకపోయినా.. గుజరాత్‌ టైటాన్స్‌తో ధోని అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అయితే.. ఇప్పటికీ ఇంత ఫిట్‌గా ఉన్న ధోని టీమిండియా నుంచి ఎందుకు అంత త్వరగా తప్పుకున్నాడో అంటూ ఫ్యాన్స్‌ బాధపడుతున్నారు.

ఇంత ఫిట్‌నెస్‌ ఉన్న ప్లేయర్‌ మరో రెండు మూడేళ్లు టీమిండియాకు ఆడి ఉంటే బాగుడేంది కదా అని అభిప్రాయపడుతున్నారు. అయితే.. కేవలం ధోని ఆటను మాత్రమే చూసేందుకు స్టేడియానికి వచ్చే ధోని అభిమానులు, కాదు కాదు.. ధోని భక్తులు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిని ధోని నిరాశపరుస్తున్నాడు. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌తో పాటు, మంగళవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ధోని బ్యాటింగ్‌కు రాలేదు. ఇలా ధోని బ్యాటింగ్‌కి రాకపోవడం, ఇంత ఫిట్‌గా ఉండి కూడా రిటైర్మెంట్‌ ప్రకటించడంపై ధోని ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణుడిలా డ్రెస్సింగ్‌ రూమ్‌లో నిలబడి.. టీమ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నాడు కానీ, తనని చూసేందుకు వచ్చే భక్తులకు మాత్రం తన బ్యాటింగ్‌ విశ్వరూపం చూపించడం లేదంటూ తెగ ఫీలైపోతున్నారు. ధోని తమకు ద్రోహం చేస్తున్నాడంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

MS dhoni diving catch

అయితే మరోవైపు ధోనిపై సీరియస్‌ విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి క్యాచ్‌లు పట్టేంతా ఫిట్‌నెస్‌ ఉంచుకుని.. నాలుగేళ్ల క్రితమే రిటైర్మెంట్‌ ఇచ్చి.. ఒక రకంగా టీమిండియాకు ద్రోహం చేశాడని, దేశానికి ఆడేకంటే.. ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ఆడేందుకే ధోని ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాడంటూ కొంతమంది క్రికెట్‌ అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. డబ్బు కోసం ఓ ఫ్రాంచైజ్‌కి క్రికెట్‌ ఆడుతూ.. ఇంతటి భారీ డైవ్స్‌ కొడుతూ క్యాచ్‌లు పట్టే ధోని.. మరికొంతకాలం టీమిండియాలో ఎందుకు కొనసాగలేదని విమర్శిస్తున్నారు. మరి ధోనిపై వస్తున్న ఈ విమర్శలు, ప్రశంసలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి