iDreamPost
android-app
ios-app

అమెరికాలో ఆకలితో తెలంగాణ యువతి! కేంద్ర మంత్రికి తల్లి లేఖ!

  • Author Soma Sekhar Published - 05:32 PM, Wed - 26 July 23
  • Author Soma Sekhar Published - 05:32 PM, Wed - 26 July 23
అమెరికాలో ఆకలితో తెలంగాణ యువతి! కేంద్ర మంత్రికి తల్లి లేఖ!

విదేశాల్లో పెద్ద పెద్ద చదువులు చదవాలని కలలు కంటూ ఉంటారు కొందరు విద్యార్థులు. ఆ కలలను నెరవేర్చుకోవాలని కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరును వదిలిపెట్టి మరీ వెళ్తుంటారు. అక్కడికి వెళ్లాక ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి, హోటల్స్ లో పనిచేస్తూ.. తమ చదువును కొనసాగిస్తూ ఉంటారు కొందరు విద్యార్థులు. అలాగే అమెరికాలో మాస్టర్స్ చేయాలని తెలంగాణ నుంచి వెళ్లింది ఓ మహిళ. మాస్టర్స్ చేయడానికి వెళ్లిన ఆ యువతి ప్రస్తుతం అమెరికాలోని షికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లి కేంద్ర మంత్రికి లేఖ రాసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..

సయ్యదా లులు మిన్హాజ్ జైదీ.. హైదరాబాద్ లోని మౌలాలికి చెందిన యువతి. అమెరికాలో మాస్టర్స్ చేయాలనేది ఆమె కల. అందుకోసం 2021లో ఆగస్టులో అమెరికాకు వెళ్లింది. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత తన తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమాతో తరచుగా ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది మిన్హాజ్ జైదీ. కానీ గత రెండు నెలలుగా తన కుమార్తె నుంచి ఎలాంటి ఫోన్ లేకపోవడంతో.. తల్లి ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే తన కూతురు చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తోందన్న సమాచారం తల్లి ఫాతిమాకు అందింది. ఆమె వస్తువువలను ఎవరో దొంగలించడంతో.. ఆకలితో రోడ్లపై తిరుగుతోందని, అలాగే ఆమె మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తల్లికి తెలిపారు. దాంతో తన కూమార్తెను తిరిగి భారత్ తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ కు లేఖ రాశారు.

ఈ లేఖలో “అమెరికాలో మాస్టర్స్ చేసేందుకు నా కూతురు సయ్యదా లులు మిన్హాజ్ జైదీ 2021 ఆగస్టులో అక్కడికి వెళ్లింది. అయితే రెండు నెలలుగా ఆమె నుంచి ఫోన్ లేదు. హైదరాబాద్ నుంచి మాకు తెలిసిన కొందరు అమెరికా వెళ్లారు. వారికి చికాగోలో నా కుమార్తె కనిపించిందని, ఆమె వస్తువులు ఎవరో దొంగలించారని, ఆకలితో అలమటిస్తోందని వారు తెలిపారు. నా కూతురిని భారత్ కు తీసుకురావాలని కోరుతున్నాను” అంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది యువతి తల్లి. ఈ లేఖను భారాస నేత ఖలీకర్ రెహమాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇదికూడా చదవండి: బాబా రాందేవ్ రూ.1.5 కోట్లతో కారు కొన్నారా? అసలు నిజం ఏంటంటే?