iDreamPost

బాబా రాందేవ్ రూ.1.5 కోట్లతో కారు కొన్నారా? అసలు నిజం ఏంటంటే?

బాబా రాందేవ్ రూ.1.5 కోట్లతో కారు కొన్నారా? అసలు నిజం ఏంటంటే?

ప్రముఖ యోగా గురు, పతంజలి సంస్థ అధినేత బాబా రాందేవ్ ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. ఆయనకు సంబంధించిన బోధనలు, యోగా వీడియోలు నెట్టింట ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ, ఇప్పుడు మాత్రం ఆయన డ్రైవింగ్ చేస్తున్న వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన రూ.1.5 కోట్లు విలువజేసే ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు నడుపుతూ కనిపించారు. ఆయన ఈ లగ్జరీ కారుని కొనుగోలు చేసినట్లు కూడా చెబుతున్నారు. ఈ విషయంపై నెగెటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే అసలు బాబా రాందేవ్ ఆ డిఫెండర్ కొన్నారా? లేదా? చూద్దాం.

ఇటీవల బాబా రాందేవ్ ఒక ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130లో షికార్లు కొట్టిన మాట వాస్తవమే. దాదాపు రూ.కోటిన్నర విలువైన ఆ డిఫెండర్ బాబా రాందేవ్ గ్యారేజ్ లో చేరిన మాట కూడా వాస్తవమే. అయితే ఆ కారుని ఈయన కొన్నాడని నెట్టింట తెగ నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అందులో సగం మాత్రమే నిజం ఉందని తెలుస్తోంది. ఆ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారు బాబా రాందేవ్ దే. అయితే ఆ కారుని ఆయన కొనుగోలు చేయలేదని తెలుస్తోంది. ఆయనకు పతంజలి గ్రూప్ ఉత్తరప్రదేశ్ తూర్పు, సెంట్రల్ రీజియన్ ఛార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్(CFA)  ధివ్యాన్షు కేసర్ వాణి బహూకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న మొదటి ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 అని చెబుతున్నారు. ఒక యోగా గురువు ఇంతటి కాస్ట్లీ కారు ఎలా కొంటరా అంటూ విమర్శలు వచ్చాయి. నిజానికి కాస్ట్లీ కారు కొనడం ఆయనకు కష్టం కాదనే చెప్పాలి. ఎందుకంటే పతంజలి సంస్థ మిలియన్ డాలర్ల బిజినెస్ చేస్తోంది. కానీ, ఆయన ఇటీవల ఒక మహీంద్రా XUV400 ఈవీని డ్రైవ్ చేస్తున్న వీడియో కూడా వైరల్ అయింది. అదే కారుని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఈ ల్యాండ్ రోవర్ మాత్రం బహుమతిగా వచ్చిందని క్లారిటీ ఇస్తున్నారు. ఏది ఏమైనా బాబా రాందేవ్ గ్యారేజ్ లోకి మాత్రం ఒక ప్రీమియం లగ్జరీ ఎస్యూవీ వచ్చి చేరింది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ కేటగిరీలో 130నే హైఎండ్ మోడల్. ఇది మూడు వరుసల సిట్టింగ్ తో వస్తోంది. ఇందులో 8 మంది ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణం చేయచ్చు.

 

View this post on Instagram

 

A post shared by AUTO WAAR (@auto.waar)

ఇంక ఈ కారు ఫీచర్స్ చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. 2023 ఫిబ్రవరిలోనే డిఫెండర్ 130ని లాంఛ్ చేశారు. డెలివరీలు మాత్రం ఇటీవలి నుంచే ప్రారంభించారు. ఈ కారులో రెండు ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక 3.0 పెట్రోల్ 6 సిలిండర్ ఇంజిన్ తో వస్తోంది. ఇందులో 399.4 హార్స్ పవర్, 550 ఎన్ఎం పీక్ టార్క్ ఉంటుంది. అలాగే 3.0 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ కూడా ఉంది. ఇది 300 హార్స్ పవర్, 600ఎన్ఎం టార్క్ తో వస్తోంది. ఈ డిఫెండర్ గరిష్టంగా 2998 సీసీతో వస్తుంది. ఇంక ఇంటీరియర్ విషయానికి వస్తే.. 11.4 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే ఉంటాయి. ఇందులో 4 జోన్ ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్ ఉంటుంది. ఇందులో ఫ్రంట్ సీట్స్ 14 ఎలక్ట్రికల్ అడ్జస్ట్ మెంట్ ఆప్షన్స్ తో వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సీట్లు వేడిగా, కూల్ గా కూడా మార్చుకోవచ్చు. 360 డిగ్రీ కెమెరాలు కూడా ఉంటాయి. దీని ధర విషయానికి వస్తే.. ఎక్స్ షోరూమ్ ధర రూ.1.30 కోట్ల నుంచి రూ.1.41 కోట్ల వరకు ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Mighty Mahindra Auto Wheels Pvt Ltd (@mightymahindra)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి