iDreamPost

మిటాలి ఎక్స్‌ప్రెస్.. భారత్ – బంగ్లాదేశ్ మధ్య మరో రైలు..

మిటాలి ఎక్స్‌ప్రెస్.. భారత్ – బంగ్లాదేశ్ మధ్య మరో రైలు..

మన దేశానికి, మన చుట్టూ ఉన్న వేరే దేశాలకి మధ్య ట్రైన్స్ చాలా అరుదుగా ఉన్నాయి. వాటిని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. మన దేశం అంతర్భాగంలోనే ఉన్నట్టు ఉండే మరో దేశంగా ఉన్న బంగ్లాదేశ్ కి మనకి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య రెండు ప్రత్యేక రైలు సర్వీసులు ఉన్నాయి. తాజాగా భారత్ – బంగ్లాదేశ్ మధ్య మరో కొత్త రైలు సర్వీస్ ని ప్రారంభించారు.

భారత్‌లోని పశ్చిమబెంగాల్‌లో న్యూ‌ జలపాయ్‌గురి రైల్వే స్టేషన్ నుంచి బంగ్లాదేశ్‌లోని ఢాకా కంటోన్మెంట్ స్టేషన్ ని కలుపుతూ మిటాలి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం అయింది. బుధవారం భారత రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, బంగ్లాదేశ్ మంత్రి మహ్మద్ నూరుల్ ఇస్లాం సుజోన్‌లు బుధవారం ఈ ప్రత్యేక రైలును ప్రారంభించారు. న్యూ జలపాయ్‌గురి – ఢాకా కంటోన్మెంట్ మధ్య బుధ, ఆదివారాల్లో ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

కొత్తగా ప్రారంభించిన ‘మిటాలి ఎక్స్‌ప్రెస్’ భారత్‌లో 69 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లో 526 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ఆది, బుధవారాల్లో ఉదయం 11.45 గంటలకు న్యూ జలపాయ్‌గురి జంక్షన్ నుండి ప్రారంభమై ఒక రాత్రి గడిచిన తర్వాత సోమ, గురువారాల్లో బంగ్లాదేశ్ ప్రామాణిక కాలమానం ప్రకారం రాత్రి 9.15 గంటలకు ఢాకా చేరుకుంటుంది. ఈ రైలు వల్ల బంగ్లాదేశ్ మరియు బెంగాల్ మధ్య పర్యాటకం, వాణిజ్యానికి మరిన్ని అవకాశాలను అందిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి