iDreamPost

టార్గెట్ 2021.. మార్పు లేదు…

టార్గెట్ 2021.. మార్పు లేదు…

పోలవరం ప్రాజెక్ట్ 2021 నాటికి పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం మంత్రి పోలవరంలో పర్యటించారు. ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ తర్వాత ఆర్‌అండ్‌ ఆర్‌, పోలవరం ప్రాజెక్ట్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమీక్ష అనంతరం మంత్రి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్ట్‌ పనులు 2021కల్లా పూర్తవుతాయన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా, కోర్టు కేసులు వేసినా నవంబర్‌లో పనులు మొదలుపెడతామని చెప్పాం. మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. ఆర్ అండ్ ఆర్ కు కు సంబంధించి 10వేల పిటిషన్‌లు వచ్చాయని, వాటిని ప్రత్యేక అధికారి ద్వారా పరిశీలిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు పనులు పూర్తి అవుతాయని పునరుద్గాటించారు. కేంద్రం నుంచి వచ్చిన బృందం అన్ని పనులు సజావుగా సాగుతున్నాయని చెప్పిందని పేర్కొన్నారు.

కాగా జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరానికి శనివారం ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఆర్ అండ్ ఆర్ కోసమే దాదాపు 33 వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంది. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం పూర్తి చేయకపోతే పనులకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. రానున్న రెండేళ్ల లో కేంద్రం కేటాయించే నిధులపై ప్రాజెక్ట్ నిర్మాణం ఆధారపడి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి