iDreamPost

Rohit Sharma: ఆ రెండు కప్పులు కొట్టడమే నా టార్గెట్.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Apr 12, 2024 | 3:23 PMUpdated Apr 12, 2024 | 3:23 PM

రోహిత్ శర్మ తన ఫ్యూచర్ గోల్స్ గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ రెండు కప్పులు కొట్టడమే తన టార్గెట్ అన్నాడు.

రోహిత్ శర్మ తన ఫ్యూచర్ గోల్స్ గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ రెండు కప్పులు కొట్టడమే తన టార్గెట్ అన్నాడు.

  • Published Apr 12, 2024 | 3:23 PMUpdated Apr 12, 2024 | 3:23 PM
Rohit Sharma: ఆ రెండు కప్పులు కొట్టడమే నా టార్గెట్.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

క్రికెట్​లో వయసు పైబడుతున్న కొద్దీ ప్లేయర్లలో పస తగ్గుతుంది. ముఖ్యంగా బ్యాటర్లలో ఇది కాస్త ఎక్కువే. 35 ఏళ్లు దాటాక బ్యాట్స్​మెన్ మునుపటిలా బాల్ మీద ఫోకస్ చేయడం, వికెట్ల మధ్య పరుగులు తీయడం, సుదీర్ఘ ఇన్నింగ్స్​లు ఆడటం కష్టమే. అయితే కొందరు దిగ్గజాలు 40వ పడిలోనూ దుమ్మురేపొచ్చని ప్రూవ్ చేశారు. కానీ చాలా మటుకు క్రికెటర్లలో ఆ వయసులోపే రిటైర్మెంట్ ఇచ్చేయడం చూస్తుంటాం. ఇక, భారత ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో రిటైర్మెంట్ మీద ఈ మధ్య పుకార్లు ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ ఓటమి తర్వాత ఇది ఇంకా శృతి మించింది. ఈ నేపథ్యంలో దీనిపై హిట్​మ్యాన్ రియాక్ట్ అయ్యాడు.

ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని రోహిత్ తేల్చిచెప్పాడు. తాను ఇప్పుడు మంచి టచ్​లో ఉన్నానని అన్నాడు. ఆ రెండు కప్పులు గెలవడమే టార్గెట్​గా పెట్టుకున్నానని స్పష్టం చేశాడు. ‘నేను రిటైర్మెంట్ గురించి ఇంకా ఆలోచించలేదు. కానీ జీవితం ఎటు తీసుకెళ్తుందో నాకు తెలియదు. ప్రస్తుతం మాత్రం నేను క్రికెట్​ను ఆస్వాదిస్తున్నా. ఈ మధ్య కాలంలో బాగా బ్యాటింగ్ చేస్తున్నా. ఇంకా కొన్ని సంవత్సరాల పాటు నేను గేమ్​లో కొనసాగుతా. ఆ తర్వాత ఏం జరుగుతుందో మాత్రం నా చేతుల్లో లేదు. వరల్డ్ కప్​ను ఒడిసి పట్టాలనేది నా కోరిక. అలాగే 2025లో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​నూ నెగ్గాలని అనుకుంటున్నా. ఆ టోర్నీలో భారత్​ విజేతగా నిలుస్తుందని ఆశిస్తున్నా’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. తన దృష్టిలో 50 ఓవర్ల ఫార్మాట్​లో జరిగే ప్రపంచ కప్పే అసలైన వరల్డ్ కప్ అని తెలిపాడు.

వన్డే వరల్డ్ కప్​ అసలైన వరల్డ్ కప్ అని.. చిన్నప్పటి నుంచి ఆ టోర్నీని చూస్తూ తాను పెరిగానన్నాడు రోహిత్. గతేడాది తృటిలో ప్రపంచ కప్ మిస్సయిందని వాపోయాడు. సొంతదేశంలో అభిమానుల మధ్య ఆ కప్పును ఒడిసిపట్టాలని అనుకున్నామని.. మెగా టోర్నీ ఆఖరి వరకు బాగా ఆడామని, కానీ ఫైనల్ గండాన్ని దాటలేకపోయామన్నాడు హిట్​మ్యాన్. సెమీ ఫైనల్​లో నెగ్గాక కప్పుకు ఇంకో అడుగు దూరంలో ఉన్నాం కాబట్టి గెలిచేస్తామని భావించామన్నాడు రోహిత్. ఫైనల్ మ్యాచ్​లోనూ కాన్ఫిడెన్స్​తో ఆడామని, కానీ కప్పును సొంతం చేసుకోలేకపోయామని పేర్కొన్నాడు. అదో బ్యాడ్ డే అని.. కొన్ని విషయాలు తమకు అనుకూలంగా జరగలేదన్నాడు. అయితే ఆస్ట్రేలియా తమ కంటే బెటర్​గా ఆడిందని, అందుకే విజేతగా నిలిచిందన్నాడు రోహిత్. మరి.. ఆ రెండు కప్పులు కొట్టడమే తన టార్గెట్ అంటూ హిట్​మ్యాన్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి