iDreamPost

Rohit Sharma: పాండ్యా కాదు.. నిజమైన కెప్టెన్ రోహితే! ఈ వీడియో చూస్తే మీరే అంటారు..

ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాదని, అసలైన కెప్టెన్ రోహిత్ శర్మ అని కితాబిస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ తో ఈ విషయం మరోసారి స్పష్టమైందని వారు చెప్పుకొస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాదని, అసలైన కెప్టెన్ రోహిత్ శర్మ అని కితాబిస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ తో ఈ విషయం మరోసారి స్పష్టమైందని వారు చెప్పుకొస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Rohit Sharma: పాండ్యా కాదు.. నిజమైన కెప్టెన్ రోహితే! ఈ వీడియో చూస్తే మీరే అంటారు..

రోహిత్ శర్మ.. ఐపీఎల్ 2024 సీజన్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ప్లేయర్. ఈ సీజన్ ప్రారంభం కాకముందే హిట్ మ్యాన్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఐదు ఐపీఎల్ టైటిళ్లు సాధించిన హిట్ మ్యాన్ ను కాదని గుజరాత్ నుంచి క్యాష్ ఆన్ ట్రేడ్ విధానం ద్వారా ఎంఐ టీమ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించింది ముంబై యాజమాన్యం. ఇక ఇక్కడి నుంచి ఎంఐ టీమ్ పాండ్యా వర్సెస్ రోహిత్ గా మారిపోయింది. జట్టు రెండుగా విడిపోయింది అంటూ వార్తలు సైతం గుప్పుమన్నాయి. అయితే పేరుకే పాండ్యా కెప్టెన్ గా ఉన్నాడు తప్పితే.. టీమ్ ను నడిపేది రోహితే అని తెలుస్తోంది. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఈ వీడియో చూస్తే.. పాండ్యా కాదు, నిజమైన కెప్టెన్ రోహితే అని మీరే అంటారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి దూరమైన తర్వాత తన పనేదో తాను చూసుకుంటున్నాడని అందరూ అనుకుంటున్నారు. అయితే ప్రాక్టీస్, బ్యాటింగ్ లో ఈ మాట నిజమే కావొచ్చు. కానీ ఒన్స్ గ్రౌండ్ లోకి దిగిన తర్వాత రోహిత్ లో ఉన్నా నాయకుడు మాత్రం ఊరుకోడు. మ్యాచ్ చేజారుతుందని అనిపిస్తే చాలు తనలో ఉన్న నాయకుడు నిద్రలేస్తాడు. ప్రస్తుతం రోహిత్ చేస్తున్న పని ఇదే. పేరుకే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా చేస్తున్నాడు. కానీ అసలైన సారథి మాత్రం రోహితే అంటున్నారు నెటిజన్లు. దానికి కొన్ని ప్రూప్స్ ను కూడా చూపిస్తున్నారు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ ఇచ్చిన సలహాతో వికెట్ తీశాడు యంగ్ బౌలర్ శ్రేయాస్ గోపాల్. అసలేం జరిగిందంటే?

Not Pandya The real captain is Rohit!

నిన్నటి మ్యాచ్ లో టైమ్ అవుట్ సమయంలో రోహిత్ శర్మలో ఉన్న కెప్టెన్ బయటికి వచ్చాడు. శ్రేయాస్ గోపాల్ తో టైమ్ అవుట్ సమయంలో మాట్లాడాడు రోహిత్. ఆ తర్వాతి ఓవర్ లోనే విధ్వంసకర ప్లేయర్ మాక్స్ వెల్ ను ఎల్బీగా అవుట్ చేశాడు శ్రేయాస్. దీంతో ఇది కదా కెప్టెన్సీ అంటే అంటూ హిట్ మ్యాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. సారథ్యంలో రోహిత్ కు ఏ కెప్టెన్ సాటిరాడంటూ కితాబిస్తున్నారు. ఇక మరికొందరు పాండ్యా కాదు.. ముంబైకి అసలైన కెప్టెన్ రోహితే అంటూ సరికొత్త వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. ప్లేయర్లను ఎలా వాడుకోవాలి, పరిస్థితులకు తగ్గట్లుగా బౌలర్లను ఎలా మార్చాలి అన్న విషయంలో రోహిత్ కు.. రోహితే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడని నెటిజన్స్ పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Aditya Pandey (@hitmania.world)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి