Nidhan
రోహిత్ శర్మ తన ఫ్యూచర్ గోల్స్ గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ రెండు కప్పులు కొట్టడమే తన టార్గెట్ అన్నాడు.
రోహిత్ శర్మ తన ఫ్యూచర్ గోల్స్ గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ రెండు కప్పులు కొట్టడమే తన టార్గెట్ అన్నాడు.
Nidhan
క్రికెట్లో వయసు పైబడుతున్న కొద్దీ ప్లేయర్లలో పస తగ్గుతుంది. ముఖ్యంగా బ్యాటర్లలో ఇది కాస్త ఎక్కువే. 35 ఏళ్లు దాటాక బ్యాట్స్‌మెన్ మునుపటిలా బాల్ మీద ఫోకస్ చేయడం, వికెట్ల మధ్య పరుగులు తీయడం, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటం కష్టమే. అయితే కొందరు దిగ్గజాలు 40వ పడిలోనూ దుమ్మురేపొచ్చని ప్రూవ్ చేశారు. కానీ చాలా మటుకు క్రికెటర్లలో ఆ వయసులోపే రిటైర్మెంట్ ఇచ్చేయడం చూస్తుంటాం. ఇక, భారత ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో రిటైర్మెంట్ మీద ఈ మధ్య పుకార్లు ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ ఓటమి తర్వాత ఇది ఇంకా శృతి మించింది. ఈ నేపథ్యంలో దీనిపై హిట్‌మ్యాన్ రియాక్ట్ అయ్యాడు.
ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని రోహిత్ తేల్చిచెప్పాడు. తాను ఇప్పుడు మంచి టచ్‌లో ఉన్నానని అన్నాడు. ఆ రెండు కప్పులు గెలవడమే టార్గెట్‌గా పెట్టుకున్నానని స్పష్టం చేశాడు. ‘నేను రిటైర్మెంట్ గురించి ఇంకా ఆలోచించలేదు. కానీ జీవితం ఎటు తీసుకెళ్తుందో నాకు తెలియదు. ప్రస్తుతం మాత్రం నేను క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నా. ఈ మధ్య కాలంలో బాగా బ్యాటింగ్ చేస్తున్నా. ఇంకా కొన్ని సంవత్సరాల పాటు నేను గేమ్‌లో కొనసాగుతా. ఆ తర్వాత ఏం జరుగుతుందో మాత్రం నా చేతుల్లో లేదు. వరల్డ్ కప్‌ను ఒడిసి పట్టాలనేది నా కోరిక. అలాగే 2025లో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌నూ నెగ్గాలని అనుకుంటున్నా. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలుస్తుందని ఆశిస్తున్నా’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. తన దృష్టిలో 50 ఓవర్ల ఫార్మాట్లో జరిగే ప్రపంచ కప్పే అసలైన వరల్డ్ కప్ అని తెలిపాడు.
వన్డే వరల్డ్ కప్ అసలైన వరల్డ్ కప్ అని.. చిన్నప్పటి నుంచి ఆ టోర్నీని చూస్తూ తాను పెరిగానన్నాడు రోహిత్. గతేడాది తృటిలో ప్రపంచ కప్ మిస్సయిందని వాపోయాడు. సొంతదేశంలో అభిమానుల మధ్య ఆ కప్పును ఒడిసిపట్టాలని అనుకున్నామని.. మెగా టోర్నీ ఆఖరి వరకు బాగా ఆడామని, కానీ ఫైనల్ గండాన్ని దాటలేకపోయామన్నాడు హిట్‌మ్యాన్. సెమీ ఫైనల్లో నెగ్గాక కప్పుకు ఇంకో అడుగు దూరంలో ఉన్నాం కాబట్టి గెలిచేస్తామని భావించామన్నాడు రోహిత్. ఫైనల్ మ్యాచ్‌లోనూ కాన్ఫిడెన్స్‌తో ఆడామని, కానీ కప్పును సొంతం చేసుకోలేకపోయామని పేర్కొన్నాడు. అదో బ్యాడ్ డే అని.. కొన్ని విషయాలు తమకు అనుకూలంగా జరగలేదన్నాడు. అయితే ఆస్ట్రేలియా తమ కంటే బెటర్‌గా ఆడిందని, అందుకే విజేతగా నిలిచిందన్నాడు రోహిత్. మరి.. ఆ రెండు కప్పులు కొట్టడమే తన టార్గెట్ అంటూ హిట్‌మ్యాన్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Rohit Sharma said “I am still playing well at this point in time – so I am thinking I am going to continue for a few more years – I really want to win the World Cup, there is a WTC final in 2025, hopefully India makes it”. [Breakfast with Champions] pic.twitter.com/oHnUSnYTOk
— Johns. (@CricCrazyJohns) April 12, 2024