iDreamPost

అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేడుకకు ప్రత్యేక విమానంలో మెగాస్టార్ ఫ్యామిలీ!

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని.. బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుపుకుంటోంది. ఈ వేడుకకు అతిరథ మహారధులు హాజరు అవుతున్నారు. అలాగే టాలీవుడ్ ప్రముఖులు సైతం.. పయనం అయ్యారు.

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని.. బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుపుకుంటోంది. ఈ వేడుకకు అతిరథ మహారధులు హాజరు అవుతున్నారు. అలాగే టాలీవుడ్ ప్రముఖులు సైతం.. పయనం అయ్యారు.

అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేడుకకు ప్రత్యేక విమానంలో మెగాస్టార్ ఫ్యామిలీ!

అయోధ్యలో ఎటు చూసినా శోభయామాన వాతారవణం కనిపిస్తోంది. దేశ నలు దిక్కులా ఉన్న ప్రజలు ఆధ్మాత్మిక భావ జాలంతో పరవశించిపోతున్నారు. ఎన్నో శతాబ్దాల చరిత్రకు మళ్లీ ప్రాణం పోసుకోనుంది ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం. అక్కడ చిన్ని రాముడు కొలువుదీరనున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుక జరుగుతుంది. జనవరి 22వ తేదీ ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. రాముని ప్రతిష్టాపన వేడుకల్లో భాగస్వామ్యులు అయ్యేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే ఇక్కడకు చేరుకున్నారు. అలాగే ఈ వేడుకకు హాజరు కావాలని సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులకు ఇన్విటేషన్లు అందాయి.

టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు ఈ ఆహ్వానాన్ని అందుకున్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఆహ్వానాన్ని మన్నించి ఆయన సతీసమేతంగా అయోధ్యకు తరలి వెళ్లారు. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్‌ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి అయోధ్యకు చేరుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. చిరంజీవి పంచెకట్టు ధరించగా.. చరణ్ షేర్వాణి దుస్తుల్లో కనిపించారు. అయోధ్యకు చేరుకోగానే.. వారిని శ్రీరాముని భక్తులు, ప్రముఖులు సాదరంగా ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

అలాగే మెగా ఫ్యామిలీలోని మరో హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా ఇన్విటేషన్ రాగా, ఆయన రోడ్డు మార్గం గుండా అయోధ్యకు పయనం అయ్యారు. అయోధ్యలోని బాల రాముని ప్రతిష్టాపన ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగనుంది. ప్రాణ్ ప్రతిష్ట నేపథ్యంలో మోడీ అత్యంత కఠినమైన దీక్ష చేపట్టిన సంగతి విదితమే. 11 రోజుల పాటు దీక్ష చేపట్టారు. కొబ్బరి నీళ్లు మాత్రమే తాగారు. నేలపై దుప్పటి కప్పుకుని నిద్రించారు. అలాగే పలు రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాలను సందర్శించారు. ఏపీలోని లేపాక్షిలోని వీరభద్ర ఆలయంతో పాటు నాసిక్, కేరళలో గరువాయుర్, త్రిప్రయార్ శ్రీ రామస్వామి దేవాలయం, తమిళనాడులోని శ్రీరంగంతో పాటు పలు దేవాలయాలను చుట్టి వచ్చారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముని ప్రతిష్ట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి