iDreamPost
android-app
ios-app

పోలీస్ స్టేషన్ లో నిందితుడు మృతి! అసలేం జరిగిందంటే?

పోలీస్ స్టేషన్ లో నిందితుడు మృతి! అసలేం జరిగిందంటే?

ఓ కేసు విషయమై స్టేషన్ కు వెళ్లిన ఓ నిందితుడు చివరికి అదే స్టేషన్ లో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం అతని తల్లిదండ్రులు కుమారుడి మరణంపై స్పందించి.. పోలీసుల కొట్టడం కారణంగానే మా కొడుకు చనిపోయాడని ఆరోపించారు. ఈ విషయంలో మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఈ యువకుడు ఎలా చనిపోయాడంటే?

పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణ మంచిర్యాల జిల్లా తాళ్లగుర్జాల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన అంజి అనే యువకుడు ఓ మహిళపై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే పోలీసులు సోమవారం అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే ఈ నిందితుడు అక్కడే చైర్ పై కూర్చుని సెల్ ఫోన్ చూస్తూ కనిపించాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. అంజి ఉన్నట్టుండి కూర్చున్న చోటే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ విషయం తెలియని పోలీసులు అతడిని లేపే ప్రయత్న చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ యువకుడు చనిపోయినట్లుగా తెలుసుకున్నారు. అనంతరం ఇదే విషయాన్ని మృతుని తల్లిదండ్రులకు తెలియజేశారు.

ఈ విషయం తెలుసుకున్న అంజి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ తర్వాత చనిపోయిన యువకుడి తల్లిదండ్రులు.. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కారణంగానే అంజి చనిపోయాడని ఆరోపణలు చేశారు. దీనిపై అధికారులు స్పందించి వెంటనే మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు స్పందించి.. నిందితుడు అంజి కూర్చున్న చోటే ఫిట్స్ వచ్చిందని, దీని కారణంగానే అతడు మరణించాడని తెలిపారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే అతని మృతికి కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: చనిపోయిందని అందరినీ నమ్మించారు.. పాపం, ఇది నిజమే అనుకుని..!