iDreamPost

డాన్ 3 సినిమాలో నటించనున్న కియారా అద్వానీ

  • Published Feb 20, 2024 | 1:33 PMUpdated Feb 20, 2024 | 1:36 PM

డాన్ 3 లో కియారా ఒక కీలక పాత్రను పోషిస్తున్నట్లు నిర్మాతలు ఈ ఉదయం ప్రకటించారు. రణవీర్ సింగ్‌తో స్క్రీన్‌ను పంచుకోవడానికి ఈ అందాల భామ సిద్ధంగా ఉన్నారు.

డాన్ 3 లో కియారా ఒక కీలక పాత్రను పోషిస్తున్నట్లు నిర్మాతలు ఈ ఉదయం ప్రకటించారు. రణవీర్ సింగ్‌తో స్క్రీన్‌ను పంచుకోవడానికి ఈ అందాల భామ సిద్ధంగా ఉన్నారు.

  • Published Feb 20, 2024 | 1:33 PMUpdated Feb 20, 2024 | 1:36 PM
డాన్ 3 సినిమాలో నటించనున్న కియారా అద్వానీ

2023లో విడుదలయిన సత్యప్రేమ్ కి కథ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను అలరించిన కియారా అద్వానీ, ప్రస్తుతం ప్రముఖ హీరో రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. తాజాగా బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ డాన్ 3 యూనిట్ లో చేరారు. డాన్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న తదుపరి చిత్రం డాన్ 3 లో కియారా ఒక కీలక పాత్రను పోషిస్తున్నట్లు నిర్మాతలు ఈ ఉదయం ప్రకటించారు.

రణవీర్ సింగ్‌తో స్క్రీన్‌ను పంచుకోవడానికి ఈ అందాల భామ సిద్ధంగా ఉన్నారు. ఐకానిక్ డాన్ ఫ్రాంచైజీలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని కియారా అద్వానీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. కాగా ప్రేక్షకులు తమ ప్రేమ, మద్దతు అందిస్తారని ఆశించారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి రితేష్ సిధ్వానీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డాన్ 3 సినిమా ప్రేక్షకులకు ఒక వండర్ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. పుష్కర్, గాయత్రిలతో పాటు ఫర్హాన్ అక్తర్ సహ రచయితగా పని చేస్తున్నారు.

kidara adwani in don 3

2025లో విడుదల కానున్న డాన్ 3 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది. 1978 లో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించగా డాన్ ఫ్రాంచైజీలోని మొదటి సినిమా విడుదలయింది. ఆ తరువాత ఫర్హాన్ అక్తర్ – షారుఖ్ ఖాన్ కలిసి ఈ ఫ్రాంచైజీను కొత్తగా మొదలుపెట్టి డాన్ (2006), డాన్ 2 (2011) సినిమాలను తీశారు. అయితే మూడవ సినిమాకి షారుఖ్ ఖాన్ స్థానంలో రణవీర్ సింగ్ వచ్చారు. నిజానికి ఈ విషయం కింగ్ ఖాన్ అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. తమ అభిమాన హీరో స్థానంలో డాన్ వంటి ఐకానిక్ పాత్రలో వేరే హీరోని ఊహించలేము అని వారు సినిమా అనౌన్స్ చేసినప్పుడే సోషల్ మీడియాలో నెగటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. మొదట షారుఖ్ ఖాన్ – రణవీర్ సింగ్‌ ఇద్దరినీ డాన్ 3 సినిమాలో నటింపజేయాలని ఫర్హాన్ అనుకున్నారట. అయితే షారుఖ్ ఖాన్ కి కథ నచ్చకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి