iDreamPost

తాళి కట్టిన భర్తను కాటికి పంపిన భార్య! కారణం ఏంటంటే?

తాళి కట్టిన భర్తను కాటికి పంపిన భార్య! కారణం ఏంటంటే?

ఈ మధ్యకాలంలో రోజుకొక దారుణం వెలుగు చూస్తూనే ఉన్నాయి. అందులో వివాహేతర సంబంధాల కేసులే ఎక్కువ. భర్తకు తెలియకుండా ప్రియుడిని మెయింటెన్ చేస్తూ ఎంచక్కా అతడినే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ప్రియుడితో గడిపేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ఏకంగా అతనితో చేతులు కలిపి మొగుడిని దారుణంగా హత్య చేయిస్తున్నారు. ఇప్పటికి ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. అచ్చం ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ప్రియుడితో ఉండేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ అతడిని ప్రాణాలతో లేకుండా చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండలో గిడుగు శ్రీనివాసులు-మాధవి అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల కిందట వివాహం జరిగి ఓ కూతురు, కుమారుడు జన్మించారు. అలా వీరి సంసార జీవితం కొన్నాళ్ల పాటు సంతోషంగానే సాగింది. ఇదిలా ఉంటే.. మాధవి ఇదే గ్రామానికి చెందిన యమన్న అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. సమయం దొరికినప్పుడల్లా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ ఉండేది.

అయితే అతడితో గడిపేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని అనుకుందో ఏమో గానీ.. మొత్తానికి తాళి కట్టిన భర్త శ్రీనివాసులును భార్య మాధవి కాటికి పంపాలని అనుకుంది. ఇదే విషయాన్ని ఆమె ప్రియుడికి చెప్పడంతో అతడు కూడా సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇద్దరు కలిసి శ్రీనివాసులు హత్యకు పథకం రచించారు. ఇదిలా ఉంటే.. మాధవి ఇటీవల తన పుట్టింటికి వెళ్లింది. కాగా, ఈ నెల 1న శ్రీనివాసులు, అతని భార్య ప్రియుడు యమన్న ఇద్దరు ఓ చోట కలుసుకున్నారు.

శ్రీనివాసలు మాత్రం.. భూత్పూరులో మోదీ సభకు వెళ్దాదమని చెప్పగా.., యమన్న మాత్రం.. వద్దని చెప్పి నమ్మించి నేరుగా వీరి సమీపంలో ఉన్న కృష్ణా నది వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత యమన్న శ్రీనివాసులును అక్కడే దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అతడి శవాన్ని దుప్పట్లో మూట చెట్ల పొదల్లో వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ రోజు శ్రీనివాసులు ఇంటికి రాకపోవడంతో అతని సోదరుడు తర్వాత రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులకు.. శ్రీనివాసులు హత్యకు గురయ్యాడని తాజాగా సమాచారం వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అనంతరం పోలీసులు మృతుని కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. ఇదే గ్రామానికి చెందిన యమన్నపై అనుమానం ఉందని చెప్పారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయట పెట్టాడు. ఈ కేసుపై పోలీసులు స్పందించి.. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని, ఇదంతా మృతుని భార్య సహకారంతోనే జరిగిందని తెలిపారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి