iDreamPost

కామాంధుడి వేధింపులను తట్టుకోలేక ఇంటి ఓనర్ ఆత్మహత్య!

కామాంధుడి వేధింపులను తట్టుకోలేక ఇంటి ఓనర్ ఆత్మహత్య!

నమ్మి ఇంట్లోని ఓ గదిని అద్దెకు ఇస్తే ఆ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా ఇంటి ఓనర్ అయిన వివాహితపై కన్నేసి ఆమెతో శారీరక కోరికలు తీర్చుకోవాలని భావించాడు. అయితే, ఇటీవల అతడు ఏకంగా ఆమెను నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆ ఇంటి ఓనర్ ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారిందిప. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రురు గ్రామంలో హస్తం శ్రీను-మంజుల (34) దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే, ఈ దంపతులు గత 10 ఏళ్ల కిందట ముంబై వెళ్లి అక్కడే కొన్నాళ్ల పాటు బిజినెస్ చేశారు. ఇక మూడు నెలల కిందట ఈ భార్యాభర్తలు తిరిగి సొంతూరుకు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఎలికెట్ట గ్రామం పరిధిలోని టిక్షతండాకు చెందిన జాటోత్ జితేందర్ అనే వ్యక్తికి ఈ దంపతులు వీరి ఇంట్లో ఖాళీగా ఉన్న ఓ గదిని అద్దెకు ఇచ్చారు. గత కొన్ని రోజుల నుంచి జితేందర్ ఇక్కడే ఉంటున్నాడు.

ఈ క్రమంలోనే అద్దెకు ఉన్న జితేందర్.. ఏకంగా ఇంటి ఓనర్ అయిన మంజులపై మోజు పడ్డాడు. ఇదే విషయం ఆమెకు అర్థమయ్యేలా అనేక సార్లు తెలియజేశాడు. ఇక ఈ విషయం ఆ వివాహిత కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జితేందర్ ను పిలిపించి కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. కానీ, ఆ వ్యక్తి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాకపోగా.., మళ్లీ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. మరోసారి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి నచ్చ జెప్పారు. కుక్క తోక వంకర అన్నట్లుగా జితేందర్ మంజులను వేధిస్తూనే ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. ఆ వ్యక్తి ఇటీవల మంజులను నమ్మించి ఓ గదికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక జితేందర్ ఆమెతో అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఇక అతని టార్చర్ తట్టుకోలేని మంజుల.. ఇటీవల ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అప్రమత్తమై వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఫలితం లేకపోవడంతో మంజుల చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణంతో మంజుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: కొడుకు చేసిన తప్పు.. శిక్ష వేసుకున్న తండ్రి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి