iDreamPost

కొడుకు చేసిన తప్పు.. శిక్ష వేసుకున్న తండ్రి!

కొడుకు చేసిన తప్పు.. శిక్ష వేసుకున్న తండ్రి!

‘నాన్న’ అనేది  రెండు అక్షరాల పదం అనుకుంటే పొరపాటు. అది ఓ  ఎమోషన్, ఓ ఎఫెక్షన్.. ఎందుకంటే.. ఎంతో బాధను భరిస్తూ కూడ తన భుజంపై ఎత్తుకుని మనకు ప్రపంచాన్ని చూపిస్తాడు. ముఖ్యంగా కొడుకు విషయంలో తండ్రి చూపించే ప్రేమ చెప్పలేనిది. బిడ్డ అభివృద్ధి కోసం రేయింబవళ్లు చేతులకు బొబ్బలు ఎక్కేలా కష్ట పడుతుంటాడు.  అలానే చిన్నతనంలో బయట బిడ్డ చేసే తప్పులను తనపై వేసుకుంటాడు.  ఇలా తండ్రి రెక్కల కష్టంతో పెరిగి పెద్ద అయినా కొందరు కుమారులు.. ఆ తండ్రే రెక్కలే తెగిపడేలా పనులు చేస్తున్నారు. తాజాగా ఓ కొడుకు చేసిన జల్సాలు.. తండ్రిని బలి తీసుకున్నాయి. కొడుకు చేసిన పనికి తీవ్ర వేదన చెందిన ఆ తండ్రి.. చివరకు మరణమే దారిగా కనిపించింది. ఈ విషాద ఘటన వరంగల్ చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

వరంగల్ జిల్లా మల్లారెడ్డి పల్లికి చెందిన పాలకుర్తి మొగిళి అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన వరంగల్ లోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్ మెన్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రతి రోజు బైక్ పై మల్లారెడ్డి పల్లె నుంచి వరంగల్ కు వెళ్లి .. విధులు నిర్వహించి.. తిరిగి రాత్రికి ఇంటికి చేరుకునే వాడు. ఈయనకు సూర్య అనే కుమారుడు ఉన్నాడు. ఇతడు బైక్ పై జల్సాలు చేస్తూ.. ఇష్టారీతిగా తిరిగే వాడంట.  అంతేకాక ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా బైక్ పై తరచూ ప్రయాణించే వాడంట. దీంతో  ఈ బైక్ పై  చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీన ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా వారి బైక్ పట్టుబడింది.

ఈ బండి  నెంబర్ పై ఉన్న చలాన్ల పెండింగ్  చెల్లించి..బైక్ తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు.  అయితే అంత డబ్బులు కట్టలేక, ఆ బైక్ లేకుండా తాను పని చేసే ప్రాంతానికి వెళ్లలేని మొగిళి మనస్తాపం చెందాడు.  అదే ఆలోచనతో బాధ పడుతూ.. పురుగుల మందు తాగాడు.  ఆయనను గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. అక్కడే  మొగిళి చికిత్స పొందుతూ మరణించారు. ఇది ఇలా ఉండగా మొగిళి చావుకు ట్రాఫిక్ పోలీసులే కారణమని కుటుంబ సభ్యులు, కొడుకు సూర్య ఆరోపిస్తూ హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు  చేశారు. మరి… ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:  వీడియో: కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌.. నెటిజన్‌ ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి