iDreamPost

అమ్మ, నాన్న, ఓ తమిళమ్మాయి సీక్వెల్ రాబోతుంది.. ట్విస్ట్ ఏంటంటే..?

అమ్మ, నాన్న, ఓ తమిళమ్మాయి..ఈ సినిమా చాలా మందికి హాట్ ఫేవరేట్. పూరి జగన్నాథ్ చిత్రాల్లో ఓ బ్లాక్ బస్టర్. రవితేజను కూడా హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమా స్వీకెల్ రాబోతుంది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది.

అమ్మ, నాన్న, ఓ తమిళమ్మాయి..ఈ సినిమా చాలా మందికి హాట్ ఫేవరేట్. పూరి జగన్నాథ్ చిత్రాల్లో ఓ బ్లాక్ బస్టర్. రవితేజను కూడా హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమా స్వీకెల్ రాబోతుంది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది.

అమ్మ, నాన్న, ఓ తమిళమ్మాయి సీక్వెల్ రాబోతుంది.. ట్విస్ట్ ఏంటంటే..?

మాస్ మహారాజా రవితేజను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గర చేసిన మూవీ అమ్మ, నాన్న, ఓ తమిళ అమ్మాయి. పూరి జగన్నాథ్, రవితేజ కాంబోలో వచ్చిన మూడవ చిత్రం. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం.. రవి కెరీర్‌నే మార్చేస్తే.. ఇడియట్ ఇండస్ట్రీలో టాప్ హీరో రేంజ్‌కు చేరుకునేలా చేసింది. ఈ రెండు హిట్లతో మంచి జోష్‌లో ఉన్న మాస్ మహారాజాకు అమ్మ, నాన్న, తమిళమ్మాయి రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు పూరీ. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రవితేజకు జోడీగా ఆశిన్ నటించింది. ఈ సినిమాలో రవితేజ, జయసుధ తల్లికొడుకులుగా నటించారు అనడం కంటే.. స్నేహితులు అనొచ్చు. అంత బాగుంటుంది వీరి మధ్య బాండింగ్. ప్రకాశ్ రాజ్ నటన సూపర్బ్. ఇక చక్రి అందించిన మ్యూజిక్.. ఇప్పటికీ వినసొంపుగా ఉంటుంది.

ఈ మూవీని సీక్వెల్ రాబోతుంది. అయితే తెలుగులో కాదండీ కోలీవుడ్ లో. ఈ చిత్రాన్ని తమిళంలో ఎం. కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి పేరుతో రీమేక్ చేశారు. మోహన్ రాజా దర్శకుడు. తమిళంలో ప్రముఖ హీరో జయం రవి నటించాడు. జయసుధ పాత్రను నదియా పోషించారు. అయితే ఈ మూవీకి సీక్వెల్ రాబోతుంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ మోహన్ రాజా వెల్లడించారు. ఎం. కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి 2 పేరుతో సినిమా తీయబోతున్నట్లు పేర్కొన్నాడు. ఈ సీక్వెల్ కు సంబంధించిన కథ సిద్దమైందని, తర్వలో షూటింగ్ ఉండబోతుందని వెల్లడించారు. అయితే తొలి పార్ట్‌లో తల్లి పాత్ర చనిపోతుంది కాబట్టి.. ఇందులో నదియా క్యారెక్టర్ ఉండదని స్పష్టం చేశారు మోహన్ రాజా. జయం రవి నటించబోతున్నాడు.

జయం రవి, మోహన్ రాజా అన్నదమ్ములు. ప్రముఖ ఎడిటర్ మోహన్ తనయులు. తెలుగులో 2001లో హనుమాన్ జంక్షన్‌తో డైరెక్టర్‌గా పరిచయమైన మోహన్ రాజా.. ఆ తర్వాత తెలుగులో హిట్టైన సినిమాలను తమిళంలో తీయడం మొదలు పెట్టారు. సుమారు 20 ఏళ్ల తర్వాత చిరంజీవితో లూసిఫర్ రీమేక్ గాఢ్ ఫాదర్ తెరకెక్కించాడు. ఆ మూవీ ఓకే అనిపించింది. ఆ తర్వాత నాగార్జున, అఖిల్‌తో మల్టీ స్టారర్ ప్లాన్ చేశాడు. కానీ అదెందుకో వర్కౌట్ కాలేదు. తన తమ్ముడితో చేసిన తని ఓరువన్ (తెలుగులో ధృవ) పార్టీ 2 ఉండబోతుందని కూడా చెప్పారు. మరీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు. అమ్మ, నాన్న, ఓ తమిళ అమ్మాయి చూస్తున్న ప్రతి సారి ఓ మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ మూవీపై  మీ అభిప్రాయమేమిటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి