iDreamPost
android-app
ios-app

లోక్ సభ జరుగుతున్న తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆవేదన!

లోక్ సభ జరుగుతున్న తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆవేదన!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గత పది రోజుల నుంచి సాగుతున్న ఈ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల వాదోపవాదనలతోనే గడిచిపోతున్నాయి. ముఖ్యంగా మణిపూర్ అల్లర్లపై ఇరుపక్షాలు సభలో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే లోక్ సభ జరుగుతున్న తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై సభకు హాజరు కాబోనంటూ స్పీకర్ తెలిపారు. సభా గౌరవానికి తగ్గట్లుగా సభ్యులు ప్రవర్తించేంత వరకు సభా కార్యక్రమాలకు హాజరు కానని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సభా గౌరవానికి తగ్గట్లు సభ్యులు ప్రవర్తించే వరకు తాను సభా కార్యక్రమాలకు హాజరు కాబోనని స్పీకర్  అన్నారు.  అధికార, ప్రతిపక్ష ఎంపీలు  సహకరించాలనే స్పీకర్ అలా మాట్లాడారు.

ఈ రోజు సభ ప్రారంభమైనప్పటి నుంచి ఓం బిర్లా రాలేదు. ఇవాళ సభాధ్యక్ష స్థానంలో ఓం బిర్లా కనిపించలేదు. గత పది రోజుల నుంచి చేస్తున్నట్లే నేడు కూడ ప్రతిపక్షాలు సభలో రచ్చ చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్ లోక్ సభను రేపటి వాయిదా వేశారు. గత పది రోజుల నుంచి ప్రతిపక్షాలు సభను సజావుగా సాగనివ్వలేదు. అయినా అధికార పక్షం మాత్రం ఏదో విధంగా బిల్లులను ఆమోదిస్తూ సభను నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే గత పది రోజు నుంచి ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నిరసనలు చేస్తున్నా.. అధికార పార్టీ నేతలు కూడ కంట్రోల్ చేయడం లేదని స్పీకర్ అసహనానికి గురైనట్లు సమాచారం.

ఈ క్రమంలోనే తాను సభకు రానని  చెప్పినట్లు  తెలుస్తోంది. మణిపూర్ ఇష్యూపై ప్రధాని మాట్లాడాలని ప్రతిపక్షాలు పట్టుబడ్డమే సభలో గందరగోళానికి ప్రధాన కారణం. గత కొన్ని రోజులుగా జరుగుతున్న సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రధాని మాట్లాడాలని డిమాండ్ చేశాయి. అందుకు ప్రభుత్వం అంగీకరిచండంతో ప్రతిపక్షాలు మరో డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చాయి. నిన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు మణిపూర్ లో పర్యటించారు. తాజాగా ప్రధాని కూడా అక్కడ పర్యటించి.. పరిస్థితులు తెలుసుకోవాలంటూ బుధవారం ప్రారంభమైన సభలో డిమాండ్ చేశారు. అంతేకాక పోడియం వద్దకు వెళ్లి ఎంపీలు నిరసనలు తెలిపారు. అధికర పార్టీ ఎంపీలు కనీసం వారిని కంట్రోల్ చేసి.. సభను సజావుగా సాగేందుకు ప్రయత్నించలేదని సమాచారం. ఈ క్రమంలోనే స్పీకర్  ఓం బిర్లా అసహనానికి గురయ్యారు.