iDreamPost
android-app
ios-app

‘లియో’కి బజ్ పెంచుతున్నారా.. పోగొడుతున్నారా?

  • Author ajaykrishna Published - 12:31 PM, Wed - 4 October 23
  • Author ajaykrishna Published - 12:31 PM, Wed - 4 October 23
‘లియో’కి బజ్ పెంచుతున్నారా.. పోగొడుతున్నారా?

ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ దగ్గరపడుతుందంటే.. ఖచ్చితంగా సినిమాకు సంబంధించి ప్రమోషనల్ స్టఫ్ వదులుతుంటారు మేకర్స్. ముఖ్యంగా సాంగ్స్, ట్రైలర్స్ ఎలాగో సినిమాకు హైప్ క్రియేట్ చేయడంలో హెల్ప్ అవుతాయి. కానీ.. సినిమాకు అవి మాత్రమే సరిపోవు కదా! నార్మల్ గా ఒకే భాషలో రిలీజ్ అయ్యే సినిమాకు, పాన్ ఇండియా మూవీగా వివిధ భాషలలో రిలీజయ్యే సినిమాకు చాలా తేడా ఉంటుంది. అదే విధంగా ప్రమోషన్స్ లో కూడా తేడాలు చూపించాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘లియో’ మూవీపై అంచనాలు పీక్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా లియో వస్తోంది. ఖైదీ, విక్రమ్ లతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్.. ఈసారి తన యూనివర్స్ లో లియోని ప్రెజెంట్ చేయబోతున్నాడు. లోకేష్ సినిమాలకు తమిళంలో ఎలాంటి క్రేజ్ ఉందో.. తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉందనేది వాస్తవం. పైగా సినిమా జైలర్ సినిమా రికార్డులను ఈజీగా క్రాస్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు అభిమానులు. అందుకు తగ్గట్టుగా ఇప్పటిదాకా సాంగ్స్, టీజర్స్ ఉన్నాయి. కానీ.. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ విషయంలో నిరాశ కనిపిస్తుందని సమాచారం.

ఆ వివరాల్లోకి వెళ్తే.. లియో ప్రమోషనల్ పోస్టర్స్ అన్ని సినిమాపైన బజ్ తగ్గేలా చేస్తున్నాయని టాక్. అందుకు కారణం.. పోస్టర్స్ లో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేసే మ్యాటర్ లేకపోవడమే అంటున్నారు. సినిమాలకు బజ్ రావడంలో పోస్టర్స్ కూడా కీలకపాత్ర పోషిస్తుంటాయి. కానీ.. లియో పోస్టర్స్ విషయంలో మేకర్స్ ఆ ఆసక్తి రేకేత్తించడం లేదనేది వాదన. ఇప్పటిదాకా సినిమా నుండి ఎలాంటి పవర్ ఫుల్ కంటెంట్ రిలీజ్ కాలేదు. సో.. అక్టోబర్ 5న ట్రైలర్ రిలీజ్ అన్నారు. కాబట్టి.. సినిమాకు కావాల్సిన బజ్ రెట్టింపు కావాలంటే లియో ట్రైలర్ ఇంపాక్ట్ చూపించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. లియోలో సంజయ్ దత్, త్రిష, అర్జున్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. మరి లియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş