iDreamPost

డబ్బులు ఊరికే రావంటూనే కోటి రూపాయల విరాళం….

డబ్బులు ఊరికే రావంటూనే కోటి రూపాయల విరాళం….

డబ్బులు ఊరికే రావంటూ ప్రకటనలతో ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న లలిత జువెలర్స్ ఎండి కిరణ్ కుమార్ తన ఉదారతను చాటుకున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం ప్రకరించారు.

కష్టపడి సంపాదించిన”డబ్బులు ఊరికే రావు” కాబట్టి నగలు, బంగారం విషయంలో జాగ్రత్తగా ఖర్చుపెట్టండి అంటూ కిరణ్ కుమార్ స్వయంగా చేసిన ప్రకటనలు ప్రజల ఆదరణను దక్కించుకున్నాయి. దానితో పాటు ఆయన చేసిన ప్రకటనకు పేరడీగా అనేక కామెడీ సీన్లు కూడా రూపొందాయి. కాగా డబ్బులు ఊరికే రావంటూ చెప్పే కిరణ్ కుమార్ కరోనా కష్టకాలంలో ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు.

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రూ. 1 కోటి విరాళాన్ని కంపెనీ ఎండి కిరణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అందజేశారు. ప్రతీ రూపాయి విలువైనదే, నగలు కొనేటప్పుడు ప్రతీ రూపాయి లెక్కచూసుకోండి అని చెప్పే కిరణ్ కుమార్ ఇప్పుడు చేసిన సాయం చూసి పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్నిరోజుల ముందు కిరణ్ కుమార్ తెలంగాణ తమిళనాడు ప్రభుత్వాలకు కూడా కోటి రూపాయల విరాళం అందజేసిన విషయం తెలిసిందే.

లలిత జ్యువెలరీ సంస్థలో మొదట్లో మెటీరియల్ సప్లై చేసిన కిరణ్ కుమార్ కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు లలిత జ్యువెలరీని హస్తగతం చేసుకున్నారు. తర్వాత నష్టాల్లో ఉన్న కంపెనీని కాస్త తన పట్టుదల, కృషితో అతి పెద్ద సంస్థగా మార్చారు. ప్రస్తుతం సుమారు 27000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా లలిత జ్యువెలరీ సంస్థ ద్వార ఉపాధి పొందుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి