iDreamPost

దీనస్థితిలో కోవై సరళ అంటూ వార్తలు! ఇప్పుడు ఎలా ఉందంటే?

  • Published May 10, 2024 | 5:15 PMUpdated May 10, 2024 | 5:15 PM

ఇటీవలే బాక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కోవై సరళ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ షోలో పాల్గొన్న ఈమె తన ఆరోగ్యం బాగలేదని, దీనస్థితిలో ఉందనే వార్తలపై తాజాగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఇటీవలే బాక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కోవై సరళ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ షోలో పాల్గొన్న ఈమె తన ఆరోగ్యం బాగలేదని, దీనస్థితిలో ఉందనే వార్తలపై తాజాగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

  • Published May 10, 2024 | 5:15 PMUpdated May 10, 2024 | 5:15 PM
దీనస్థితిలో కోవై సరళ అంటూ వార్తలు! ఇప్పుడు ఎలా ఉందంటే?

‘కోవై సరళ’.. ఈ మధ్య ఈ లేడీ కమెడియన్ పేరు తరుచు ఏదో ఒక రకంగా వార్తలో వినిపిస్తుంది. కాగా, ఇటీవలే కోవై సరళ ‘బాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల అయిన నుంచి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సరళ తన వ్యక్తిగత విషయాలను, పలు ఆసక్తికర విషయాలను గురించి చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ షోలో పాల్గొన్న ఈ కమెడీ క్రీన్ మరొసారి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.ఆ వివరాళ్లోకి వెళ్తే..

తెలుగు చిత్ర పరిశ్రమ పై టాప్ లేడీ కమెడియన్ ఎవరంటే.. అందరూ టక్కున చెప్పే పేరు కోవై సరళ అనే అంటారు. అంతలా సరళ తనదైన నటన, కమెడితో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. అయితే పేరుకు మలయాళ నటి అయిన ఈమె తెలుగులో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే బాక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కోవై సరళ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ షోలో పాల్గొన్న ఈమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అయితే ఆ షోలో తన సినీ కెరీర్ ఎలా ప్రారంభమైంది అనే ప్రశ్న ఎదురవ్వగా.. దానికి స్పందించిన కోవై సరళ మాట్లాడుతూ.. ‘మూడుమూళ్లు సినిమాను తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు మా ఇంటి పక్కన ఉండేవారు. అయితే ఓ రోజు ఇంటి దగ్గర షూటింగ్ జరుగుతుండగా.. నాకు ఓ అవకాశమిచ్చారు. ఇక ఆ మూవీ సూపర్ హిట్టయింది. దీంతో అలా నా సినీ ప్రయాణం మొదలైంది. ఈ క్రమంలోనే నేనే దాదాపు 15 చిత్రాల్లో హీరోయిన్ గా చేశాను. ఆపై 900కు పైగా సినిమాల్లో నటించాను. అయితే కోలీవుడ్ నా పుట్టినిల్లయితే.. టాలీవుడ్ నా మెట్టినిల్లు వంటింది’ అని కోవై సరళ చెప్పుకొచ్చారు.

Kovai sarala

అలాగే పెళ్లెందుకుచేసుకోలేదు అనే ప్రశ్న రావడంతో అందుకు స్పందిస్తూ..’స్వేచ్చ కోసమే నేను పెళ్లి చేసుకోలేదు. కచ్చితంగా వివాహం చేసుకోవాలని రూలేమీ లేదు కదా.. మనం భూమి మీదకు ఒంటరిగా వచ్చాం. ఇక్కడికి వచ్చాకే అన్ని బంధాలు ఏర్పడుతాయి. ఇక ఎంతోమంది పిల్లలు ఉన్నప్పటికీ చివరి రోజుల్లో ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు.   అందుకే ఎప్పుడూ మనల్నీ చూసుకునేందుకు ఒకరుండాలని ఎప్పుడూ ఎదురు చూడకూడదు. ధైర్యంగా ముందుకు సాగిపోవాలంతే అని చెప్పుకొచ్చారు.  అంతేకాకుండా.. తెలుగులో సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో.. సతీ లీలావతి సినిమా కోసం కమల్ హాసన్‌ పక్కన హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. అప్పుడు నేను నమ్మలేదు.

కానీ, ఆ తర్వాత కమల్‌ ఫోన్‌ చేసి నా డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే తెలుగులో బిజీగా ఉన్నానని చెప్తే నాకోసం ఐదు నెలలు వెయిట్‌ చేశారు. ఆ మూవీ చాలా బాగా వచ్చిందని అన్నారు. ఇకపోతే ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగోలేదని, ఖర్చులకు డబ్బుల్లేక దీన స్థితిలో ఉన్నట్లు రూమర్స్‌ వచ్చాయి. మా అక్కవాళ్లందరూ నన్ను ఇంట్లో నుంచి గెంటేశారని కూడా రాసేశారు. కానీ అలాంటివేమీ జరగలేదు. నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. అలాగే నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదు’ అని కోవై సరళ చెప్పుకొచ్చింది. మరి, కోవై సరళ చెప్పుకొచ్చిన ఆసక్తికర విషయాల పై మీ అభిప్రాయాను కామెంట్స్ రూపంలో తెలియజేండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి