iDreamPost

Kondaveeti Simham : పోలీసు దుస్తుల్లో అన్నగారి విశ్వరూపం

అన్నగారితో మరో సినిమా తీయాలనే సంకల్పం ఆయనది. ఆ మాటే నేరుగా అన్నగారికే వెళ్లి చెప్పినప్పుడు దర్శకుడిగా రాఘవేంద్రరావు పేరు వినగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

అన్నగారితో మరో సినిమా తీయాలనే సంకల్పం ఆయనది. ఆ మాటే నేరుగా అన్నగారికే వెళ్లి చెప్పినప్పుడు దర్శకుడిగా రాఘవేంద్రరావు పేరు వినగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

Kondaveeti Simham : పోలీసు దుస్తుల్లో అన్నగారి విశ్వరూపం

1981 సంవత్సరం. దీనికి అయిదారేళ్ళ ముందు ఎన్టీఆర్ వయసైపోతోంది, ఇక హీరోగా మాస్ పాత్రలు చేయడం కష్టమనుకుంటున్న తరుణంలో ‘అడవిరాముడు’ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. దాని వసూళ్ల దెబ్బకు తారకరాముడి స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు మరోసారి తెలిసి వచ్చింది. అదే ఊపులో వచ్చిన ‘సర్దార్ పాపారాయుడు’ లాంటి బ్లాక్ బస్టర్లు చరిత్రను తిరగరాస్తూనే వచ్చాయి . రోజా మూవీస్ అధినేత అర్జునరాజుకు ‘వేటగాడు’ అలా కనక వర్షం కురిపించినదే. అన్నగారితో మరో సినిమా తీయాలనే సంకల్పం ఆయనది. ఆ మాటే నేరుగా అన్నగారికే వెళ్లి చెప్పినప్పుడు దర్శకుడిగా రాఘవేంద్రరావు పేరు వినగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

కానీ సిద్ధంగా కథ లేదు. రచయిత సత్యానంద్ తమిళంలో వచ్చిన తంగపతకం(1976)ని సూచించారు. అప్పటికే దాని డబ్బింగ్ వెర్షన్ ని అల్లు రామలింగయ్య గారు గీత ఆర్ట్స్ సంస్థ నుంచి ‘బంగారు పతకం’గా డబ్బింగ్ చేసి విజయం అందుకున్నారు. అందుకే దాన్నే రీమేక్ చేస్తే రిస్క్ అవుతుందేమో అనే అనుమానం అందరికీ వచ్చింది. కానీ సత్యానంద్ కొన్ని కీలక మార్పులు చేసి కొత్త వెర్షన్ వినిపించారు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కు తన సంతానంలో దారి తప్పిన ఓ కొడుకుకు మధ్య సంఘర్షణగా సరికొత్త ట్రీట్మెంట్ తో సిద్ధం చేశారు. హీరోయిన్ గా లక్కీ గర్ల్ శ్రీదేవి ఎంపిక కాగా కీలకమైన క్యారెక్టర్ మోహన్ బాబుకు దక్కడం కెరీర్లో పెద్ద బ్రేక్.

కేవలం రెండు నెలల లోపే షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. చక్రవర్తి ఎప్పటిలాగే అదిరిపోయే పాటలు ఇవ్వగా. కెఎస్ ప్రకాష్ ఛాయాగ్రహణం అందించారు. జయంతి, రావు గోపాల్ రావు, అల్లు రామలింగయ్య, నగేష్, చలపతిరావు, గీత తదితరులు ఇతర తారాగణం. 1981 అక్టోబర్ 7న దసరా పండగ సందర్భంగా విడుదలైన కొండవీటి సింహంకు జనం పట్టం కట్టారు. ప్రతి చోటా కలెక్షన్ల ప్రభంజనం. ముప్పై కేంద్రాలకు పైగా వంద రోజుల పండగ జరుపుకుంది. తెలిసిన కథకే ఈ రీతిలో ఆదరణ దక్కడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. క్లైమాక్స్ లో పెద్ద ఎన్టీఆర్ పాత్ర చనిపోవడం మీద మొదట్లో అనుమానాలు వచ్చినా అదే రైటని ఋజువయ్యింది

Also Read : Sitara : వంశీ చెక్కిన అందమైన శిల్పం – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి