iDreamPost
android-app
ios-app

ప్రేమించి పెళ్లి.. ఆరు నెలలు తిరక్కుండానే..!

  • Published Sep 06, 2023 | 12:04 PM Updated Updated Sep 06, 2023 | 12:04 PM
  • Published Sep 06, 2023 | 12:04 PMUpdated Sep 06, 2023 | 12:04 PM
ప్రేమించి పెళ్లి.. ఆరు నెలలు తిరక్కుండానే..!

పైన కనిపిస్తున్న వీళ్లిద్దరూ భార్యాభర్తలు. గత ఆరు నెలల కిందట తల్లిదండ్రులను ఎదురించి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహ అనంతరం ఈ నూతన దంపతులు బెంగుళూరులో కాపురం పెట్టారు. భార్య సాప్ట్ వేర్ ఉద్యోగి కావడంతో భర్త ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. అలా కొన్ని రోజుల పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే పెళ్లై ఆరు నెలలు కూడా తిరక్కుండా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో యువతి కుటుంబ సభ్యులు షాక్ గురవుతున్నారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం పరిధిలోని మలెల్లెల గ్రామానికి చెందిన శ్రీవిద్య (22), నీరుగంటివారిపల్లికి చెందిన విజయ్ కుమార్ రెడ్డి అనే ఇద్దరూ కాలేజీ స్నేహితులు. అప్పటి నుంచి వీళ్లకు పరిచయం ఉండేది. అలా కొంత కాలానికి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇక గతేడాది పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఎలాగైన పెళ్లి చేసుకోవాలని భావించి ఆరు నెలల కిందట గుడిలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్నసబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు.

వివాహ అనంతరం ఇద్దరు బెంగుళూరులో కాపురం పెట్టారు. శ్రీవిద్య సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండేది. విజయ్ కుమార్ మాత్రం ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల ఈ దంపతుల మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. చివరికి శ్రీవిద్య ఇంట్లో శవమై తేలింది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అప్పటి నుంచి విజయ్ కుమార్ కనిపించకుండాపోయినట్లుగా తెలుస్తుంది. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet Girişİmajbetcasibomjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobet