iDreamPost
android-app
ios-app

భర్త శృంగారానికి నో చెప్పడం నేరం కాదంటూ హైకోర్టు వ్యాఖ్యలు!

భర్త శృంగారానికి నో చెప్పడం నేరం కాదంటూ హైకోర్టు వ్యాఖ్యలు!

భార్యాభర్తలు మనసులతోనే కాకుండా.. శారీరకంగా కూడా ఒక్కటి అయినప్పుడే వారి బంధం బలపుతుంది అని చెబుతుంటారు. అలాగే భార్యకు ఇష్టం లేకుండా ఆమెను తాకడం, శృంగారం కోసం ఫోర్స్ చేయడం కూడా నేరంగానే పరిగణిస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే చాలా డిబేట్లు, కేసులు కూడా నడిచాయి. అయితే ఇప్పటివరకు ఒక భర్త శృంగారానికి నో చెబుతున్నాడంటూ ఎవరూ కోర్టుకు ఎక్కిన దాఖలాలు లేవు. అయితే అలాంటి ఒక కేసు కూడా ఉంది. భర్త శృంగారానకి నో చెబుతున్నాడని ఓ భార్య అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఇందుకు సంబంధించి హైకోర్టు తీర్పుని కూడా వెలువరించింది.

ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఒక జంటకు డిసెంబర్ 18, 2019లో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత నుంచి తన భర్త తనకు శారీరకంగా దూరంగా ఉంటున్నాడని, శృంగారంపై ఆసక్తి లేదని, తనని దగ్గరకు రానివ్వడంలేదని ఓ భార్య కేసు నమోదు చేసంది. 2020లో తన భర్త, వారి కుటుంబంపై భార్య ఐపీసీ సెక్షన్ 498ఏ, వరకట్న నిరోధక చట్టం 1961 కింద కేసు పెట్టింది. వారిపై కేసు పెట్టడాన్ని భర్త హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు. ఈ కేసులో జస్టిస్ ఎం నాగప్రసన్న తమ తీర్పుని వెలవరించారు. భర్త శారీరక సంబంధానికి దూరంగా ఉండాలి అనుకోవడం హిందూ వివాహం చట్టం క్రూరమేనంటూ వ్యాఖ్యానించారు.

అయితే ఐపీసీ సెక్షన్ 498ఏ ప్రకారం మాత్రం అది నేరం, క్రూరత్వం కాదంటూ వ్యాఖ్యానించారు. పిటిషినర్ ప్రేమ అనేది శారీరక సంబంధం మాత్రమే కాదని.. అది మనసుల కలక అని నమ్మడంలో ఎలాంటి తప్పు లేదని అభిప్రాయపడ్డారు. భార్య పెట్టిన క్రిమినల్ కేసుని కొట్టేయడమే కాకుండా.. భర్త శృంగారానికి నో చెప్పడం తప్పేం కాదని వ్యాఖ్యానించారు. ఈ కేసుని ఇంకా కొనసాగించడం.. చట్టాని అగౌరవ పరచడం, తప్పుదోవ పట్టించడమే అవుతుందని తెలియజేశారు. ప్రస్తుతం ఈ కేసు, ఇందులో కర్ణాటక హైకోర్టు వెలువరించిన తీర్పు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. కొందరైతే ఆడవాళ్ల మాదిరిగానే మగవాళ్లకు నో చెప్పే హక్కు ఉంది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి