iDreamPost

AI మహిమ.. ఇందిరాగాంధీతో బాలీవుడ్ హీరోయిన్ కంగనా!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, మాజీ ప్రధానితో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వారిద్దరు పక్క పక్కనే కూర్చొని ముచ్చటిస్తున్నారు. అయితే ఈ ఫోటోపై కంగనా ఫ్యాన్ అయోమయానికి గురయ్యారు. అసలు విషయం ఏంటంటే..

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, మాజీ ప్రధానితో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వారిద్దరు పక్క పక్కనే కూర్చొని ముచ్చటిస్తున్నారు. అయితే ఈ ఫోటోపై కంగనా ఫ్యాన్ అయోమయానికి గురయ్యారు. అసలు విషయం ఏంటంటే..

AI మహిమ.. ఇందిరాగాంధీతో బాలీవుడ్ హీరోయిన్ కంగనా!

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎమర్జెన్సీ’.  ఈ చిత్రానికి ఈ బ్యూటీనే నిర్మాతగా  కూడా వ్యవహరిస్తున్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమాను తీయనున్నారు. ఈ చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కంగనానే పోషిస్తున్నారు. ఇంకా ఈ సినిమా విడుదలకు సంబంధించిన ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు. అయినప్పటికీ కంగనా మూవీ ప్రమోషన్స్ మాత్రం జోరుగా చేస్తుంది.  తాజాగా ఇందిరాగాంధీతో దిగిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫిక్స్ ఎలా సాధ్యమైంది.  ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఏదో ఒక వివాదం తో వార్తల్లో నిలుస్తుంటారు. అలానే రాజకీయ అంశాలపై ఆమె స్పందిస్తూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’ . ఈ సినిమా పేరు ప్రకటించిన కంగనా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఈ సమయంలో ఆమె నేరుగా ఇందిర చెంతనే కూర్చున్నట్లుగా ఉన్న ఫోటో వైరల్‌గా మారింది. వారిద్దరూ ఎదురెదురుగా కూర్చొని ఏదో చర్చిస్తున్నట్టుగా ఆ ఫోటోలో కనిపిస్తోంది.

అధునాతన ఏఐ టెక్నాలజీతో ఈ అరుదైన దృశ్యం సాకారమైంది. ఈ ఫోటోను కంగనా రనౌత్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.అంతేకాక ఐజీతో చాట్ చేయడం చాలా ఆనందంగా ఉందంటూ పోస్టు చేశారు. ఎమర్జెన్సీ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రకు  మూవీ యునిట్ ఐజీ అని కోడ్‌ నేమ్‌ పెట్టుకుంది. అలాగే ప్రధాని మోదీ (ఏఐ ఇమేజ్‌)తో దిగిన చిత్రాన్నికంగనా పోస్టు చేశారు. దిల్లీలోని ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’లో ఈ సీన్ చోటుచేసుకుంది.

దేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు అంకితం చేసిన కొత్త మ్యూజియం ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను సోమవారం కంగన సందర్శించారు. వీరాంగనా కీ మహాగాథ పేరిట ఆవిష్కరించిన లైట్‌ అండ్ సౌండ్‌ షోలో ఆమె పాల్గొన్నారు. పురాతన, ఆధునిక విధానాల ద్వారా చరిత్రలోని అనేక అధ్యాయాలు ఈ షో ద్వారా తన కళ్లముందు ఆవిష్కృతమయ్యాయని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా వచ్చి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పొందొచ్చని ఈ షో గురించి ఆమె వెల్లడించారు.

ఇక ఎమర్జెన్సీ సినిమా విషయానికి వస్తే.. ఇందులో కంగనాతో పాటు చాలా మంది నటులు ఉన్నారు. జయప్రకాశ్ నారాయణ్ గా అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజేపేయ్ పాత్రలో శ్రేయాస్ తల్పాడే, మొరార్జీ దేశాయ్ పాత్రలో అశోక్ ఛబ్రా నటిస్తున్నారు. 1975-77 మధ్య దేశంలో  అత్యవసర స్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంతో మంది నేతలు జైలు పాలయ్యారు. అంతేకాక అనేక ఘటనలు ఆ ఎమర్జెన్సీ టైమ్ లో చోటుచేసుకున్నాయి.

అప్పటి పరిస్థితుల ఆధారంగా ఎమర్జెన్సీ సినిమాను కంగనా తీస్తోన్నారు. ఈ సినిమాను 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స భావిస్తున్నారు. ఈ సినిమా కోసం తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ తనఖా పెట్టినట్లు కంగనా చెప్పారు. ‘మణికర్ణిక’ తర్వాత ఆమె దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. మరి.. ఇంధిరాగాంధీతో కంగనా ఉన్న ఏఐ ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి