iDreamPost
android-app
ios-app

పాత నోట్లకు.. లక్షల్లో డబ్బులు! లక్షాధికారి అవ్వాలనుకుని చివరికి..!

పాత నోట్లకు.. లక్షల్లో డబ్బులు! లక్షాధికారి అవ్వాలనుకుని చివరికి..!

మీలో చాలామందికి పాత నోట్లు, పాత నాణేలు దాచుకునే అలవాటు ఉండే ఉంటుంది. చాలా మంది వద్ద పాత అర్ధ రూపాయి బిళ్లలు, రూపాయి నోట్లు, ఐదు రూపాయల నోట్లు ఉండే ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో అలాంటి వింటేజ్ కరెన్సీని ఎక్కువ డబ్బులిచ్చి కొంటాం అంటూ సోషల్ మీడియాలో చాలానే ప్రకటనలు చూసుంటారు. ‘1970 నాటి మొక్కజొన్న కంకులు ఉన్న ఈ రూపాయి బిళ్ల మీ దగ్గరుంటే అక్షరాలా 5 లక్షలు పొందచ్చు’ అంటూ ఊదర కొడుతూ ఉంటారు. అవి చూసి వదిలేస్తే ఏ గోలా ఉండదు. కానీ, ఈ సాయిలు చేసినట్లు వాళ్లకు ఫోన్ చేశారా? మొదటికే మోసం వస్తుంది మరి.

చాలా మందికి బోల్డ్ కరెన్సీని కలెక్ట్ చేసే అలవాటు ఉంటుంది. దాదాపుగా ఎంతో మంది వద్ద అప్పటి రూపాయి, ఐదు రూపాయలు ఉండే ఉంటాయి. అలాంటి వాటికి మార్కెట్ లో డిమాండ్ ఉందని చెప్పి ఇప్పుడు కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్డుతున్నారు. తాజాగా ఈ ఉచ్చులో కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ కు చెందిన సాయిలు అనే వ్యక్తి ఇరుక్కున్నాడు. పర్టిక్యులర్ గా ఈ సంవత్సరంలో ఈ నోటు, ఈ నాణెం కావాలి అంటూ ఒక ప్రకటనను చూశాడు. అక్కడితో ఆగకుండా అది తన వద్ద ఉంది అంటూ వారితో మాట కలిపారు. నిజానికి సాయిలుకి హిందీ రాకపోయినా కూడా గట్టిగానే మేనేజ్ చేసి వారితో డీల్ కుదుర్చుకున్నాడు.

సాయి దగ్గరున్న నాణేలకు గట్టిగానే ఆఫర్ చేశారు. ఎటూ కట్టే సొమ్ము కాదు కదా.. అందుకే ఒక అంకె ఎక్కువే చెప్పినట్లు ఉన్నారు. సాయిలుకి రూ.77 లక్షల వరకు ఆఫర్ చేశారు. ఆ భారీ అమౌంట్ వినగానే సాయిలు కనెక్ట్ అయిపోయాడు. అయితే డబ్బు ట్రాన్స్ ఫర్ చేయడానికి ముందు ప్రాసెసింగ్ ఫీజ్ అని, ట్యాక్సులు అని చాలానే లెక్కలు చెప్పారు. ఇంకేముంది ఈరోజే నీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయంటూ ట్రిప్పుకొకసారి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. మొత్తం మీద సాయిలు రూ.60 వేల వరకు ఈ సైబర్ నేరస్థులకు ముట్టజెప్పాడు. ఎంతకీ వాళ్ల నుంచి డబ్బు రాకపోవడంతో.. ఆగ్రహానికి గురైన సాయిలు వారిని నిలదీశాడు. తన డబ్బు తనకి వెనక్కి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేశాడు.

మనోడు అంత గట్టిగా అడగ్గానే అవతలి వాళ్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. అప్పుడు సాయిలుకు అసలు విషయం తెలిసింది. తాను మోసపోయిన విషయం గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. తన డబ్బు వెనక్కి ఇప్పించాలంటూ మోసం చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎంతగా పెరిగిపోయాయో అందరికీ తెలుసు. ప్రాట్ టైమ్ జాబ్ లని, వీడియోలు లైక్ చేస్తే డబ్బులిస్తామని, ఈ వస్తువుపై భారీ డిస్కాంటు అని లింకులు సెండ్ చేయడం అబ్బో చాలానే ఉన్నాయి. అయితే మీరు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఉద్యోగం ఇచ్చేవాడు, మీ దగ్గర నాణేలు కొనేవాడు మీకు డబ్బులు ఇస్తాడు గానీ.. మిమ్మల్ని డబ్బులు అడగడు. ఆ విషయాన్ని మైండ్ లో పెట్టుకుంటే మీరు ఇలా చిన్న చిన్న విషయాల్లో మోసపోకుండా ఉంటారు.