iDreamPost

రిలీజ్ కు ముందే మిలియన్ డాలర్స్ తో రికార్డు బ్రేక్ చేస్తున్న కల్కి మూవీ

  • Published Jun 18, 2024 | 8:06 AMUpdated Jun 18, 2024 | 8:06 AM

Kalki 2898 AD Pre Sale Collections: కల్కి సినిమా చూసేందుకు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమా గురించి ప్రతి రోజు ఎదో ఒక బజ్ వినిపిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు కల్కి సినిమా ప్రీ సేల్స్ కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Kalki 2898 AD Pre Sale Collections: కల్కి సినిమా చూసేందుకు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమా గురించి ప్రతి రోజు ఎదో ఒక బజ్ వినిపిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు కల్కి సినిమా ప్రీ సేల్స్ కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

  • Published Jun 18, 2024 | 8:06 AMUpdated Jun 18, 2024 | 8:06 AM
రిలీజ్ కు ముందే మిలియన్ డాలర్స్ తో రికార్డు బ్రేక్ చేస్తున్న కల్కి మూవీ

నాగ్ అశ్విన్ నిర్మించిన కల్కి ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సమయం దగ్గర పడుతుంది. కల్కి సినిమా థియేటర్ రిలీజ్ కు కేవలం కొద్దీ రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. కానీ ఇంకా మేకర్స్ మాత్రం ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ విషయంలోను ప్రేక్షకులను మొదట కాస్తా నిరాశ పరిచింది కల్కి టీమ్. ఇక ఇప్పుడు ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీ గా రాబోతున్న సరే.. ఏ మాత్రం హడావిడి లేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి ఏ అప్ డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ సేల్ విషయాల గురించి.. సోషల్ మీడియాలో బాగా బజ్ నడుస్తుంది.

చిన్న చిన్న సినిమాలకే థియేటర్ రిలీజ్ టైమ్ దగ్గర పడుతుంది అంటే.. ఓ రేంజ్ లో ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇంటర్వూస్ ఇవ్వడం.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని.. ఇలా ఎదో ఒక హడావిడి ఉంటూనే ఉంటుంది. కానీ కల్కి సినిమా విషయంలో మాత్రం ఈ హడావిడి ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా ప్రతి అప్ డేట్ కూడా.. అందరికి బాగానే హైప్ క్రియేట్ చేసింది. ఇక యానిమేషన్ సిరీస్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ కి స్పెషల్ అట్రాక్షన్ బుజ్జి.. ఈ బుజ్జి కార్ ను చెన్నై , ఢిల్లీ లాంటి నగరాల్లో రైడ్ చేస్తూ.. అందరిని ఆశ్చర్యాన్ని కలిగించారు. ఇక ఇప్పుడు కల్కి సినిమా రిలీజ్ కు ముందే.. ఓ రికార్డు ను క్రియేట్ చేసింది. కేవలం ప్రీ సేల్స్ తోనే నార్త్ అమెరికాలో రెండు మిలియన్ డాలర్స్ ను కొల్లగొట్టింది కల్కి మూవీ.. ఈ రికార్డు మాత్రం నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లా కేవలం కల్కి కి మాత్రమే సాధ్యం అనిపించుకుంటుంది.

ఇంకా కల్కి సినిమా థియేటర్ లో విడుదల కావడానికి.. తొమ్మిది రోజుల సమయం ఉంది. ఇలా విడుదలకు ముందే కలెక్షన్స్ ఈ రేంజ్ లో ఉన్నాయంటే.. ఫస్ట్ డే కలెక్షన్స్, లాంగ్ రన్ కలెక్షన్స్ ఇంకా ఎలా ఉంటాయో .. ఎవరి ఊహకు అందవేమో అనిపిస్తుంది. గతంలో ప్రభాస్ నటించిన సినిమాలకే ఫస్ట్ డే కలెక్షన్స్.. 150 కోట్ల వరకు సాధించాయి. ఇక ఇప్పడు కల్కి సినిమా ఆ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక థియేటర్ రిలీజ్ కు ముందు ఇంకా ఈ సినిమా నుంచి ఎటువంటి అప్ డేట్స్ వస్తాయో వేచి చూడాలి. మరి కల్కి సినిమా అప్ డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి