iDreamPost

కట్టుకున్న వాడి కళ్లెదుటే ఊహించని ఘటన.. గుండెలు పగిలేలా ఏడ్చిన భర్త!

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కళ్లదుటే అతని భార్య ఊహించని ప్రమాాదానికి గురైంది. ఈ ఘటనతో అతడు గుండెలు పగిలేలా ఏడ్చాడు. అసలేం జరిగిందంటే?

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కళ్లదుటే అతని భార్య ఊహించని ప్రమాాదానికి గురైంది. ఈ ఘటనతో అతడు గుండెలు పగిలేలా ఏడ్చాడు. అసలేం జరిగిందంటే?

కట్టుకున్న వాడి కళ్లెదుటే ఊహించని ఘటన.. గుండెలు పగిలేలా ఏడ్చిన భర్త!

వారిది అందమైన కుటుంబం. ఎలాంటి కష్టాలు, నష్టాలు లేకుండా సంతోషంగా సాగుతున్న కాపురం. పుట్టిన పిల్లలను చూసుకుంటూ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. కానీ, ఉన్నట్టుండి కట్టుకున్న వాడి కళ్లముందే భార్యకు అలా జరగడంతో భర్త తట్టుకోలేపోయాడు. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేదక గుండెలు పగిలేలా ఏడ్చాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ మహిళకు ఇలా జరగడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంతకు ఈ మహిళకు ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో కుడిపూడి రాము-పుష్ప దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు ఎనిమిదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహ అనంతరం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక వారిని చూసుకుంటూ ఈ భార్యాభర్తలు సంతోషంగా ఉండేవారు. ఇదిలా ఉంటే.. ఈ దంపతులు విజయవాడ వెళ్లాలని అనుకున్నారు. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా తాడేపల్లి వెళ్లేందుకు పిల్లలతో పాటు దంపతులు ఓ బైక్ పై బయలు దేరారు. ఇక వీరి వాహనం ప్రతిపాడు దగ్గరకు రాగానే వీరి బైక్ అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో రాము భార్య పుష్ప బై క్ పై నుంచి ఎగిరి కిందపడింది. అదే సమయానికి వెనకాల నుంచి ఆర్టీసీ బస్సు వేగంగా రావడంతో ఆ మహిళ దాని చక్రాల కిందపడిపోయి నుజ్జు నుజ్జు అయింది.

దీంతో పుష్ప భర్త కళ్లేదుటే రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ సీన్ చూసి భర్త రాము గుండెలు పగిలేలా ఏడ్చడు. అప్రమత్తమైన వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి భార్య పుష్ప మృతి చెందడంతో భర్త రాము కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి చెందడంతో ఆమె కుమారులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పుష్ప మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి