iDreamPost

తల్లితో వివాహేతర సంబంధం! ఆమె కూతురిపై మనసు పడి దారుణం!

తల్లితో వివాహేతర సంబంధం! ఆమె కూతురిపై మనసు పడి దారుణం!

ఈ రోజుల్లో కొందరు యువకులు పెళ్లైన మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. వారి భర్తలకు తెలియకుండా సీక్రెట్ గా ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ అసలు విషయం బయటకు రావడంతో చివరికి హత్యలకు గురవుతున్నారు. అయితే ఇలాంటి ఘటనలోనే ఓ యువకుడు పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలోనే ప్రియురాలి కూతురిపై మనసుపడి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని ప్రియురాలికి చెప్పడంతో ఆమె నిరాకరించింది. కట్ చేస్తే.. చివరికి ఊహించని దారుణం చోటు చేసుకుంది. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కడప పట్టణంలోని ముస్లింకోటలో ఓ మహిళ నివాసం ఉండేది. ఈమెకు గతంలో వివాహం జరిగి ఓ కూతురు జన్మించింది. కాగా, ఈ మహిళ భర్త గతంలో చనిపోవడంతో అప్పటి నుంచి తన కూతురిని చూసుకుంటూ స్థానికంగా పనికి వెళ్లేది. ఈ క్రమంలోనే ఈ మహిళకు ఇదే ప్రాంతానికి చెందిన సుబాహాని (24) అనే యువకుడు పరిచయ అయ్యాడు. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారిపోయింది. దీంతో ఇద్దరూ సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్లు. ఇక ఈ యువకుకుడు తన ప్రియురాలికి ఆర్థికంగా కూడా బాగానే సహాయం చేసినట్లుగా తెలుస్తుంది.

ఇదిలా ఉంటే.. సుబాహాని గతంలో కువైట్ వెళ్లి ఇటీవల ఇంటికి తిరిగొచ్చాడు. ఇకపోతే.. సుబాహాని ప్రియురాలు ఆమె కూతురికి పెళ్లి చేయాలని అనుకుంది. ఈ విషయం తెలుసుకున్న సుబాహాని.. నీ కూతురిని నేను పెళ్లి చేసుకుంటానని ప్రియురాలిని అడిగాడు. కానీ, ఆ మహిళ దీనికి నిరాకరించి మరో యువకుడితో కూతురికి పెళ్లి ఖాయం చేసింది. ప్రియురాలు అలా చేయడంతో సుబాహాని కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే ఆ సుబాహాని తన ప్రియురాలిని హత్య చేయాలని పథకం రచించాడు.

ఇందులో భాగంగానే ఆ సుబాహాని.. ఇటీవల ఆ మహిళను మంగళవారం రాత్రి ఓ చోటుకు రమ్మన్నాడు. ఇక ప్రియుడు కోరినట్టే ఆమె అక్కడికి వెళ్లింది. దీంతో ఆ మహిళ రాగానే సుబాహాని ఆమెను అతి దారుణంగా హత్య చేసి శవాన్ని బాత్ రూమ్ లో పడేశాడు. ఆ తర్వాత నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయి జరిగిందంతా పూసగుచ్చినట్లుగా వివరించాడు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి