iDreamPost
android-app
ios-app

వీడియో: పోలీసుల కాలర్ పట్టి.. హంగామా చేసిన kA పాల్

వీడియో: పోలీసుల కాలర్ పట్టి.. హంగామా చేసిన kA పాల్

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కు చేదు అనుభవం ఎదురయింది. విశాఖలో స్టీల్ ఫ్లాట్  ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిరవధిక దీక్షకు కూర్చొన్న విషయం తెలిసిందే. అయితే కేఏ పాల్  దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలోనే కేజీహెచ్ గేట్ దగ్గర పోలీసులతో కేఏ పాల్ గొడవ పడ్డాడు.  అంతేకాక కేఏ పాల్ పోలీసుల ముందు ఓవరాక్షన్ చేశారు. పోలీసులతో దురుసుగా వ్యవహరించమే కాక.. వారి కాలర్ పట్టుకుని రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. విశాఖలో నిరవధిక నిరాహాక దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. లాభాల్లో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ ను అధోగతి పాలు చేసి అదానీకి  కారు చౌకగా కట్ట బెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక ఆయన చేపట్టిన ధీక్షను విరమించాలని పోలీసులు కోరారు. అయితే ఆయన ససేమిరా అనడంతో.. బలవంతగా అక్కడి నుంచి లేపి.. ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే తనకు వైద్యం అక్కర్లేదని, కేజీహెచ్ దగ్గర పోలీసులతో గొడవకు దిగారు.

అడ్డుకోబోయిన సీఐ కాలర్ ను కేఏ పాల్ పట్టుకున్నారు. పోలీసులపై అరుస్తూ, పెద్దగా కేకలు వేస్తూ హంగామా సృష్టించారు. తాను ఆరోగ్యంగానే వున్నానని.. పోలీసులు వదిలిపెట్టాలని గొడవ చేశారు. చాలా సమయం పాటు చూసిన పోలీసులు చివరకు.. దీక్షా శిబిరం నుంచి ఆయనను బలవంతంగా తరలించారు. అంబులెన్స్ ఎక్కించి కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి లోపలికి వెళ్లకుండా గేటు వద్దే కేఏ పాల్ గొడవ చేశారు. ఆరోగ్యంగా వున్న తనను ఎందుకు ఆస్పత్రికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.