iDreamPost

రోజా కోసం రంగంలోకి జగన్! నగరి నేతలకు ఆర్డర్స్ వెళ్లాయి!

రోజా కోసం రంగంలోకి జగన్! నగరి నేతలకు ఆర్డర్స్ వెళ్లాయి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, క్రీడ శాఖ మంత్రి ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైసీపీలో  బలమైన వాయిస్ వినిపించే నేతల్లో ఆమె ఒకరు. సీఎం జగన్ పై ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తే.. వెంటనే కౌంటర్లు ఇచ్చి నేతలు ఆర్కే రోజా ఒకరు. సీఎం జగన్ పదవి ఇచ్చిన, ఇవ్వకున్నా కూడా రోజా..ఒకేలా ఉన్నారు. అలాంటి నాయకురాలిని నగరిలో ముప్పుతిప్పులు పెడుతున్నారనే వార్తలు వినిపిస్తోన్నాయి. ఆమెను నగరిలో ఓడించేందుకు సొంత పార్టీ నేతలు తయారైనట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలోనే రోజా కోసం జగన్ రంగంలోకి దిగినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ‘జగనన్న విద్యాదీవెన’ నిధుల విడుదలకు రోజా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిని వేదికగా ఎంచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఆర్కే రోజా.. 2014,2019 వరుసగా రెండు సార్లు చిత్తూరు జిల్లా నగరి నియోజక వర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేకాక సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కూడా దక్కించుకున్నారు. పార్టీ కోసం రోజా చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు జగన్ మోహన్ రెడ్డి పదవి ఇచ్చిన, ఇవ్వకున్న.. పార్టీ కోసం, జగన్ కోసం గట్టిగా పనిచేసింది. అలాంటి రోజాను వచ్చే ఎన్నికల్లో ఓడించాలనే ప్రయత్నంలో స్థానిక నేతలు ఉన్నారు. వారికి అండగా జిల్లాకు చెందిన ఓ పెద్ద నేత కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రోద్భలంతోనే నగరిలోని వైసీపీ నేతలు మండలాల వారీగా రోజాకు వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారని టాక్.

ఈ నేపథ్యంలోనే సీఎం జగన్  చేసిన నగరి పర్యటనలోనూ వైసీపీ నేతల అంతర్గబేధాలు బట్టబయలు అయ్యాయి. రోజాను మరోసారి గెలిపించుకునేందుకు స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే రోజాతో  ఆమెకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్న ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కేజే శాంతిని కలపారు. రోజాతో చేతిలో శాంతి చేయివేయించి.. వారిద్దరని కలిపారు. సీఎం జగన్  స్వయంగా రావడంతో.. శాంతి ఇష్టం లేకున్న అలా ఏదో చేయిలో చేయి వేసింది. ఈ క్రమంలో రోజాకు వ్యతిరేకంగా కట్టిన గ్రూపుల విషయంలో సీఎం చాలా సీరియస్ గా ఉన్నట్లు టాక్.

ఈక్రమంలోనే రోజాకు మద్దతుగా సీఎం జగన్ రంగంలోకి తిగినట్లు తెలుస్తోంది. అలానే వచ్చే ఎన్నికల్లో రోజాను గెలిపించుకునేందుకు అందరూ కృషిచేయలని తెలిపినట్లు సమాచారం. రోజాకు మద్దతు నియోజవర్గ నేతలు ఉండాల్సిందేనని హెచ్చరికలు జారీ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. నగరిలో రోజా మళ్లీ గెలవాలని స్థానిక నేతలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. వైసీపీ తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తోన్న  నాయకురాలికి భరోసా ఉండాలనే ఉద్దేశంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారని రాజకీయ విశ్లేషకు అభిప్రాయ పడుతున్నారు. మరి..  నగరిలో జరుగుతున్న పాలిటిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: NTR చావుకు కారణమైన వాళ్లే ఆయన ఫోటోకు దండం పెడుతున్నారు: CM జగన్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి