iDreamPost

జాన్సన్ అండ్ జాన్సన్ కు భారీ షాక్.. మహిళకు రూ.375 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశం

  • Published Apr 22, 2024 | 12:12 PMUpdated Apr 22, 2024 | 12:12 PM

ఈ మధ్య కాలంలో ప్రతిదీ కల్తీ అయిపోతుంది. తినే ఆహార పదార్ధాల దగ్గర నుంచి వాడే వస్తువుల వరకు ప్రతిదీ ప్రాణాలకు హాని కలిగిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా పసి బిడ్డలకు వాడే మరొక ప్రొడక్ట్ గురించి కొన్ని ఆసక్తి కర విషయాలు బయటపడుతున్నాయి.

ఈ మధ్య కాలంలో ప్రతిదీ కల్తీ అయిపోతుంది. తినే ఆహార పదార్ధాల దగ్గర నుంచి వాడే వస్తువుల వరకు ప్రతిదీ ప్రాణాలకు హాని కలిగిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా పసి బిడ్డలకు వాడే మరొక ప్రొడక్ట్ గురించి కొన్ని ఆసక్తి కర విషయాలు బయటపడుతున్నాయి.

  • Published Apr 22, 2024 | 12:12 PMUpdated Apr 22, 2024 | 12:12 PM
జాన్సన్ అండ్ జాన్సన్ కు భారీ షాక్.. మహిళకు రూ.375 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశం

ఇప్పుడు బయట ఏ ఆహార పదార్ధం తీసుకోవాలన్నా.. ఏ వస్తువు కొనాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తుంది. కేంద్రం కూడా ఎప్పటికప్పుడు వీటిపైన తగిన జాగ్రత్తలు తీసుకుంటూ .. వాటిని మార్కెట్ లో రద్దు చేస్తున్నప్పటికీ.. వెలికి తీస్తున్న కొద్దీ.. కొత్త ప్రొడక్ట్స్ కు సంబంధించిన విషయాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోతాజాగా చిన్న పిల్లలు వాడే జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు కొన్ని పరీక్షలలో బయట పడ్డాయి. దీనితో అమెరికాలో వేలాది మంది జనం.. వారి పిల్లల భద్రత గురించి దిగులు చెందుతున్నారు. అంతే కాకుండా ఒక మహిళ కుటుంబానికి.. కొన్ని కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ బ్రాండ్ సంస్థ అయిన జాన్సన్ అండ్ జాన్సన్ కి.. అమెరికా కోర్టు భారీ షాక్ ను ఇచ్చింది. ఏ బేబీ పౌడర్ కారణంగా కేన్సర్ సోకుతుందని.. అమెరికాకు చెందిన థెరిసా గ్రేసియా అనే మహిళ కోర్టులో కేసు వేసింది. ఆమె దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ కేసు గురించి పోరాడుతూ వచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా ఈ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ కేసు గురించి.. ఆమెకు అనుకూలంగా.. తీర్పు వెలువడింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ తీర్పు వెలువడడానికి ముందే 2020లో ఆమె కేన్సర్ తో చనిపోయింది. రెండేళ్ల క్రితం థెరిసా గ్రేసియా అనే మహిళ క్యాన్సర్ వ్యాధితో చనిపోగా.. ఆమె కుటుంబ సభ్యులు.. జాన్సన్ అండ్ జాన్సన్, కెన్‌వ్యూ సంస్థలపై కేసు వేశారు. తాజాగా దీనికి సంబంధించి తీర్పును ప్రకటించిన కోర్టు.. ఆమె కుటుంబానికి పరిహారంగా.. 45 మిలియన్ డాలర్లు( సుమారు రూ.375 కోట్లు) చెల్లించాలని.. ఆదేశాలు జారీ చేసింది.

Big shock for Johnson and Johnson

అయితే, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ మాత్రం.. తాము తయారు చేస్తున్న.. ఈ పౌడర్ లో ఎటువంటి క్యాన్సర్ కారకాలు లేవని.. గత వందేళ్లుగా వారి సంస్థ అనేక సరైన పద్దతిలోనే ఉత్పత్తులు తయారు చేస్తున్నామని వివరించింది. కానీ, ఇప్పటికే అమెరికా, కెనడా దేశాలలో.. ఈ సంస్థకు సంబంధించిన ప్రొడక్ట్స్ ను నిలిపివేశారు. అంతే కాకుండా గత పదేళ్లుగా ఈ సంస్థ.. అమ్మకాలపై ఏకంగా 38 వేలకు పైగా వ్యాజ్యాలు కోర్టులో ఉన్నాయి. ఇప్పుడు థెరిసా గ్రేసియా అనే మహిళకు అనుకూలంగా తీర్పు లభించింది. మరి, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తన తరపున పూర్తి స్థాయిలో.. ఏ మేరకు రుజువు చేసుకోనుందనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి