Arjun Suravaram
Landslides Ethiopia: కొద్ది రోజుల నుంచి భారీగా వానాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని పలు ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. అలానే పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఒక ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది.
Landslides Ethiopia: కొద్ది రోజుల నుంచి భారీగా వానాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని పలు ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. అలానే పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఒక ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది.
Arjun Suravaram
ఇటీవల కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని పలు ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలల్లో వానలు దంచికొడుతున్నాయి. ఈక్రమంలోనే నదులు, వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఇదే సమయంలో ఉత్తర భారత దేశంలో కూడా వానలు విజృంభిస్తొన్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఒక ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడి 229 మంది మృతి చెందారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..
ఆఫ్రికా ప్రాంతానికి చెందిన ఇథియోపియా దేశంలోఈ ఘోర ప్రమాదం జరిగింది. కొండ చరియలు ఇరిగి పడటంతో 229 మంది మృతి చెందారు. దక్షిణ ఇథియోపియా ప్రాంతీయ రాష్ట్రంలోని గోఫా జిల్లాలో సోమవారం ఈఘటన చోటు చేసుకంది. ఇటీవలే కురుస్తున్న భారీ వానల కారణంగా సోమవారం ఉదయం కొండ చరియలు విరిగిపడ్డాయి. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్, స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఉన్న వారిని వెలికితీసే చర్యలు ప్రారంభించారు.
ఇదే సమయంలో అక్కడ జనం భారీగా గుమిగూడారు. ఈ క్రమంలోనే మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో సహయక చర్యలు చేస్తున్న, గుమిగూడిన జనంపై కొండచరియలు పడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో తొలుత 50 మృతి చెందినట్లు స్థానిక అధికారులు చెప్పగా… తాజాగా ఆ సంఖ్య 229 చేరింది. మృతుల్లో మహిళలు, పిల్లలు, స్థానిక పోలీసులు ఉన్నారని అధికారులు తెలిపినట్లు ఇథియోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ నివేదించింది. సోమవారం గోఫా జోన్‌లోని కెంచో-షాచా ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 148 మంది పురుషులు, 81 మంది మహిళలు మరణించినట్లు సమాచారం. అలానే చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారుల చెబుతున్నారు.
ఈ ఘోర ప్రమాదంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విపత్తు ప్రభావాన్ని తగ్గించేందుకు ఫెడరల్ డిజాస్టర్ ప్రివెన్షన్ టాస్క్‌ఫోర్స్‌ని రంగంలోకి దింపామని, ఎక్స్‌పై జరిగిన ఘోర నష్టంపై ఆ దేశ ప్రధాని అబీ అహ్మద్ తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆఫ్రికన్ యూనియన్ కమీషన్ చీఫ్ మౌసా ఫకీ మహమత్ బాధితుల కుటుంబాలకు, ఇథియోపియన్ ప్రభుత్వానికి ఎక్స్ లో తన సంతాపాన్ని, సంఘీభావాన్ని అందించారు. ఇదే సమయంలో ఇక్క శిథిలాల్లో చిక్కుకున్న వారిని కనుగొనడానికి, గాయపడిన వారికి సాయం చేయడానికి రెస్క్యూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గతంలోనూ ఇలానే జరిగి.. ఏకంగా ఓ గ్రామమంతా సమాధిగా మారింది.