iDreamPost
android-app
ios-app

‘వార్ 2’ కన్నా ముందే బాలీవుడ్ లోకి NTR!

  • Author Soma Sekhar Published - 10:55 AM, Thu - 21 September 23
  • Author Soma Sekhar Published - 10:55 AM, Thu - 21 September 23
‘వార్ 2’ కన్నా ముందే బాలీవుడ్ లోకి NTR!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దమైంది. 2019లో వచ్చిన ‘వార్’ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ‘వార్ 2’ మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్నాడన్న విషయం అందరికి తెలిసిందే. దీంతో ‘వార్ 2’పై భారీ హైప్ ఏర్పడింది. ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? వార్ 2 కంటే ముందుగానే బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడట మన తారకరాముడు. ఇప్పుడు ఇదే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. మరి ఇంతకీ యంగ్ టైగర్ ఏ మూవీలో కనిపించబోతున్నాడో తెలుసుకుందాం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. RRR మూవీతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. దీంతో బాలీవుడ్ మేకర్స్ కన్ను తారకరాముడిపై పడింది. ఎన్టీఆర్ యాక్టింగ్ కు ఫిదా అయిన బాలీవుడ్ మేకర్స్ అతడి డేట్స్ కోసం వేచిచూస్తున్నారు. ఈ క్రమంలోనే వార్ 2 చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. బ్లాక్ బస్టర్ మూవీ వార్ కి సీక్వెల్ కావడం, అదీకాక హృతిక్ ఒకవైపు.. ఎన్టీఆర్ మరోవైపు తెరపై కనిపిస్తే.. థియేటర్లలో పూనకాలే అని చెప్పవచ్చు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. దీంతో యాశ్ రాజ్ ఫిల్మ్స్ తీసే స్పై యూనివర్స్ లోకి యంగ్ టైగర్ కూడా ఎంట్రి ఇచ్చినట్లు అవుతుంది.

ఇదిలా ఉండగా.. వార్ 2 కంటే ముందుగానే ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. బీ టౌన్ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ వార్ 2 కన్నా ముందుగానే ‘టైగర్ 3’లో నటించనున్నాడట. టైగర్ 3 బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ జిందా హై’ మూవీకి సీక్వెల్. ఈ మూవీ క్లైమాక్స్ లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఉంటుందట. ఎన్టీఆర్ పాత్రను ఇక్కడ పరిచయం చేయడం వల్ల వార్ 2లో అతడి పాత్రను కీలకంగా మార్చడానికి వీలుంటుందని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లానింగ్ అంతా యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగానే జరుగుతున్నట్లు అక్కడి వర్గాలు చెప్పుకుంటున్నాయి. కాగా.. వార్ 2 చిత్రానికి ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా సమాచారం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.