iDreamPost

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి! వైరలవుతున్న పోస్ట్..

  • Author Soma Sekhar Updated - 10:22 AM, Thu - 21 September 23
  • Author Soma Sekhar Updated - 10:22 AM, Thu - 21 September 23
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి! వైరలవుతున్న పోస్ట్..

సెలబ్రిటీలు తమ ప్రొఫెషనల్ కు, తమ లైఫ్ కు సంబంధించిన విషయాలను సోసల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక తమ ఇంట్లో ఏ చిన్న వేడుకైనా లేదా విశేషమైనా జరిగితే వెంటనే ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. తాజాగా ఓ బుల్లితెర నటి, సింగర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ తల్లిదండ్రులైన విషయాన్ని తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గతంలో ఈ జంట చాలా సార్లు ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు కూడా. ఆ జంట ఎవరో కాదు సింగర్, బిగ్ బాస్-14 కంటెస్టెంట్ రాహుల్ వైద్య, బుల్లితెర నటి దిశా పర్మార్. బుధవారం దిశా పర్మార్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

బిగ్ బాస్ 14 కంటెస్టెంట్ రాహుల్ వైద్య, బుల్లితెర నటి దిశా పర్మార్ తల్లిదండ్రులైయ్యారు. బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది దిశా పర్మార్. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇన్ స్టాలో రాస్తూ..”మమ్మల్ని ఆ దేవుడు ఆడబిడ్డతో ఆశీర్వదించాడు. తల్లి, బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది. తను ప్రగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి మాకు అండగా నిలిచి, ఉత్తమమైన సేవలు అందించినందుకు వైద్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సంతోష సమయంలో మా పాపకు మీ అశీర్వాదాలు కావాలి” అంటూ రాసుకొచ్చారు.

అయితే వినాయకుడి పండగ సందర్భంగా బిడ్డ జన్మించడంతో.. వినాయకుడి కార్టూన్ ఫొటోను షేర్ చేసింది ఈ జంట. ఇక ఈ విషయం తెలిసిన పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ 14 లో దిశా పుట్టిన రోజు సందర్భంగా రాహుల్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. 2021 జూలై 16న వీరి వివాహం ముంబైలో జరిగింది. ఇక దిశా మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి.. పలు టీవీ షోల్లో మెరిసింది. ఇక రాహుల్ ఇండియన్ ఐడల్ తొలి సీజన్ లో కనిపించాడు.

 

View this post on Instagram

 

A post shared by RAHUL VAIDYA (@rahulvaidyarkv)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి