iDreamPost
android-app
ios-app

జవాన్ ఓటిటి రిలీజ్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఆ రోజు నుండే..

  • Author ajaykrishna Updated - 03:16 PM, Sat - 7 October 23
  • Author ajaykrishna Updated - 03:16 PM, Sat - 7 October 23
జవాన్ ఓటిటి రిలీజ్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఆ రోజు నుండే..

2023.. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కి బాగా కలిసి వచ్చింది. ఏడాది ఆరంభంలో పఠాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన షారుఖ్.. ఏడాది మధ్యలో జవాన్ తో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఏడాది ఎండింగ్ లో కూడా సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. షారుఖ్ ని ఇలా సూపర్ ఫామ్ లో చూసి చాలా ఏళ్లు అవుతోంది. అప్పుడెప్పుడో చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీతో సాలిడ్ హిట్ అందుకొని.. కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ నమోదు చేశాడు. ఆ తర్వాత చాలా సినిమాలు ఫుల్ హైప్ తో తెరపైకి వచ్చినప్పటికి.. ఏ ఒక్కటీ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. దీంతో 2018లో జీరో మూవీ ప్లాప్ తర్వాత మళ్ళీ నాలుగేళ్లు సినిమాలు చేయకుండా ఉండిపోయాడు.

దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ మళ్ళీ.. యష్ రాజ్ ఫిలిమ్స్ వారి స్పై యూనివర్స్ లో పఠాన్ సినిమా చేశాడు. ఆ సినిమా షారుఖ్ కి ఊహించని బూస్ట్ ఇచ్చింది. ఏకంగా రూ. 1000 కోట్లు వసూల్ చేసి.. కింగ్ ఈజ్ బ్యాక్ అనుకునేలా చేసింది. పఠాన్ రిజల్ట్ తో ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీ. కట్ చేస్తే.. సరిగ్గా ఆరు నెలలకు.. అంటే సెప్టెంబర్ లో జవాన్ తో ప్రేక్షకులను పలకరించాడు. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ సినిమాని.. స్వయంగా షారుఖ్ సొంత ప్రొడక్షన్ హౌస్ లో నిర్మించారు. జవాన్ కి షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మాతగా వ్యవహరించారు. జవాన్ పై ముందునుండి పాజిటివ్ హైప్ ఉంది. అందుకు అనిరుధ్ మ్యూజిక్ కూడా ఓ కారణం.

కట్ చేస్తే.. జవాన్ విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేసేసింది. ఇదికూడా రూ. 1000 కోట్లు దాటి కలెక్షన్స్ రాబట్టింది. ఒకే ఏడాదిలో ఒకే హీరోకి సంబంధించి రెండు సినిమాలు వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేయడం ఇదే మొదటిసారి. అంతేగాక ఇప్పుడు ఇదే ఏడాది మూడో సినిమా డుంకి కూడా రిలీజ్ చేస్తున్నాడు. సో.. దాని రిజల్ట్ బట్టి షారుఖ్ సోలో హీరోగా.. ఎవరు సాధించలేని కలెక్షన్స్ కొల్లగొట్టిన లిస్ట్ లో టాపర్ అవుతాడు. ఇదిలా ఉండగా.. జవాన్ సినిమా థియేటర్స్ లో విడుదలై నెల రోజులు అవుతోంది. సో.. థియేట్రికల్ రన్ ముగుస్తుంది. కాబట్టి.. ఇప్పుడు జవాన్ ఓటిటి రిలీజ్ కి సంబంధించి క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. అదేంటంటే.. జవాన్ ఓటిటి రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. అయితే.. సినిమాని నవంబర్ 2వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జవాన్ ఓటిటి న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మరి జవాన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomMariobetMadridbetbetciomatbet girişjojobetdeneme bonusugrandpashabet girişgrandpashabet girişJojobet Girişcasibom girişGrandPashaBet Şikayetvarjojobet girişcasino siteleriCasibom GirişCasibomcasibomcasibomjojobetcasibom girişjojobet girişcasibom