iDreamPost

జవాన్ ఎఫెక్ట్.. ఖుషి బాక్సాఫీస్ రన్ కి బ్రేక్ వేసిందా..?

  • Author ajaykrishna Published - 09:57 AM, Sat - 9 September 23
  • Author ajaykrishna Published - 09:57 AM, Sat - 9 September 23
జవాన్ ఎఫెక్ట్.. ఖుషి బాక్సాఫీస్ రన్ కి బ్రేక్ వేసిందా..?

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు బిగ్ బడ్జెట్ తో నిర్మించారు. రొమాంటిక్ లవ్ డ్రామాగా ఈ సినిమా.. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యింది. తెలుగు, తమిళంతో ఇతర భాషలలో విడుదలై.. మంచి టాక్ అయితే సొంతం చేసుకుంది. కాగా.. మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. ఓవర్సీస్ లో అద్భుతమైన నెంబర్స్ నమోదు చేసింది. తెలుగులో నైజాంతో పాటు తమిళనాడులోను మంచి వసూళ్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఇక మొదటి మూడు రోజులు కుమ్మేసిన ఖుషి మూవీ కలెక్షన్స్.. తర్వాత మెల్లగా తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఆంధ్ర సీడెడ్ లలో ఓపెనింగ్ డే నుండే అంచనాలను అందుకోలేక పోయింది. ప్రస్తుతం మొదటి వారానికి ఖుషి.. మొత్తం రూ. 38.30 కోట్లు షేర్ వసూల్ చేసింది. ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం సుమారు రూ. 15 కోట్లు షేర్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇకపోతే ఇప్పుడు తాజాగా థియేటర్స్ లో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ యాడ్ అయ్యింది. దీంతో సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసరికి జనాలంతా ఆ సినిమా వైపు పరుగులు పెడుతున్నారు.

అదిగాక ఖుషికి తెలుగు రాష్ట్రాలలో ప్రెజెంట్ నైజాంలో 100 కి పైగా థియేటర్స్, ఆంధ్ర సీడెడ్ లో 110 వరకు థియేటర్స్ మాత్రమే ఉన్నాయట. మరి ఈ థియేటర్స్ లోనే జవాన్ ఎఫెక్ట్ ని తట్టుకొని మరీ రూ. 15 కోట్లు షేర్ వసూల్ చేయాల్సి ఉందని సమాచారం. వారవారం వస్తున్న కొత్త సినిమాలను తట్టుకొని నిలబడాలంటే ఖుషికి కాస్త కష్టమే అనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జవాన్ ఊపు కనిపిస్తోంది. మొదటి రోజు జవాన్ ఏకంగా రూ. 9 కోట్లకు పైగా వసూల్ చేయడం విశేషం. ఈ లెక్కన ఖుషి హిట్ టాక్ తో నష్టాలు మిగిల్చే అవకాశం లేకపోలేదు. ఓ రకంగా ఖుషి రన్ కు జవాన్ ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. మరి ఖుషి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి